Dharani
విజయనగం రైలు ప్రమాద ఘటన బాధితులను పరామర్శించనున్నారు సీఎం జగన్. అలానే బాధిత కుటుంబాలకు భారీగా పరిహారం కూడా ప్రకటించారు. ఆ వివరాలు..
విజయనగం రైలు ప్రమాద ఘటన బాధితులను పరామర్శించనున్నారు సీఎం జగన్. అలానే బాధిత కుటుంబాలకు భారీగా పరిహారం కూడా ప్రకటించారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పలాస-రాయగడ రైళ్లు పరస్పరం ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా.. 33 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులంతా సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అంతేకాక నేడు సీఎం జగన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్.. రైల్వే శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి.. సమాచారం తెలుసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో.. మంత్రి బొత్స సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఎం జగన్ నేడు రైలు ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లనున్నారు. కంటకాపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌వాసులే అధికంగా ఉన్నారు.
రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలను పరిహారంగా ప్రకటించారు సీఎం జగన్. అలానే ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు 2 లక్షల పరిహారం అందిచనున్నట్టు ప్రకటించారు.
ఇక మిగతా రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఈ సంఘటనపై తనకు మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాక హెల్ప్‌లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.