Dharani
Dharani
పిల్లలకు మనమిచ్చే అతి గొప్ప ఆస్తి చదువే అని బలంగా నమ్ముతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే ఆయన అధికారంలోకి రాగానే విద్యా రంగంలో కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారు. నేటి కాలంలో ఇంగ్లీష్ భాషకున్న ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే.. ఇంగ్లీష్ నైపుణం తప్పని సరి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియమే. అందుకే చాలా మంది తల్లిదండ్రులు.. తమ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా సరే.. అప్పు చేసి మరి పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తున్నారు.
మరి అక్కడ ఏమైనా నాణ్యమైన విద్య లభిస్తుందా అంటే లేదు. పాదయాత్ర సమయంలో ఈ పరిస్థితులను దగ్గరుండి చూశారు సీఎం జగన్. అందుకే అధికారంలోకి రాగానే.. తన తొలి ప్రాధాన్యతను చదువుకే ఇచ్చారు. విద్యారంగంలో కీలక సంస్కరణలు అమలు చేసే దిశగా అడుగులు వేశారు. దానిలో ముఖ్యమైనది.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం. సీఎం జగన్ నిర్ణయం కారణంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణల మీద విదేశీ ప్రతినిధులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఇక విద్య తర్వాత సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చిన మరో రంగం వైద్యం. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరగు పరిచేందుకు.. వైద్య సిబ్బంది కొరతను తగ్గించేందుకు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. దీనిలో భాగంగా తాజాగా విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు సీఎం జగన్.
ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థిని ఒకరు సీఎం జగన్ సేవా స్ఫూర్తిపై ప్రశంసలు కురిపించింది. తాను ఒక పేద కుటుంబానికి చెందిన యువతిని అని.. కానీ సీఎం జగన్ చర్యల వల్ల.. తాను నేడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న మెడికల్ కాలేజీలో చదువుతున్నానని తెలిపింది. తామందరం కష్టపడి పని చేసి విజయనగరం మెడికల్ కాలేజీని దేశంలోనే అత్యుత్తనంగా నిలుపుతామని చెప్పుకొచ్చింది. జగన్ సంకల్పం వల్లే ఇది సాధ్యమయ్యిందని వెల్లడించింది. సీఎం జగన్‌ని స్ఫూర్తిగా తీసుకుని.. తాము కూడా సేవ చేస్తామని.. సమాజానికి సేవ చేస్తామని చెప్పుకొచ్చింది. తన పీజీ అయ్యాక.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పని చేస్తానని వెల్లడించింది. విద్యార్థిని మాటలు విని సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.