iDreamPost
android-app
ios-app

విజయవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఆ మూడు రోజులు ఉచితంగా

  • Published May 30, 2024 | 11:07 AM Updated Updated May 30, 2024 | 11:07 AM

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఆ మూడు రోజులు ఉచితంగా ఆ సేవలను అందిస్తామని తెలిపారు. ఆ వివరాలు..

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఆ మూడు రోజులు ఉచితంగా ఆ సేవలను అందిస్తామని తెలిపారు. ఆ వివరాలు..

  • Published May 30, 2024 | 11:07 AMUpdated May 30, 2024 | 11:07 AM
విజయవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఆ మూడు రోజులు ఉచితంగా

వేసవి సెలవులు కావడంతో చాలా మంది.. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తున్నారు. తిరుమల, విజయవాడ వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇక వీకెండ్‌ వస్తే ఈ ఆలయాల్లో రద్దీ మాములుగా ఉండటం లేదు. దర్శనానికి గంటల సమయం పడుతుంది. తెలంగాణ యాదగిరిగుట్టలో ఇదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో విజయవాడ దుర్గమ్మ దర్శానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పాడు. మూడు రోజుల పాటు ఉచితంగా ఆ సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో.. రద్దీ మరింత ప ఎరిగింది. ఈ క్రమంలోనే దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. వారాంతాల్లో అనగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి.. వారి కోసం.. ఉచితంగా బస్సుల్ని నడపాలని దుర్గమ్మ ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తుల కోసం దేవస్థానానికి చెందిన 12 బస్సులు ఉంటే.. వీటిలో 8 బస్సులలో భక్తులను ఉచితంగా ఆలయానికి చేరవేస్తారు.

తాజా నిర్ణయం నేపథ్యంలో ఆలయ అధికారులు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటుగా పున్నమిఘాట్‌, వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించారు. అంతేకాక భక్తులు కొండపైకి వెళ్లేందుకు పున్నమిఘాట్‌ దగ్గర నుంచి రెండు బస్సులు నడపాలని భావిస్తున్నారు. అలానే మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి నాలుగు బస్సులు, వీఎంసీ ఎదురు పార్కింగ్‌ వద్ద నుంచి రెండు బస్సులు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. అలానే పార్కింగ్‌ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాక ఆ వారాంతాల్లో.. భక్తులు, వాహనాలు రద్దీని బట్టి కొండపైకి పరిమిత సంఖ్యలో వాహనాలను అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్‌ను నియంత్రించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కొండపైన ఓం టర్నింగ్‌ దగ్గర ఉన్న పార్కింగ్‌ ప్రాంతంలో.. 150 వరకు కార్లు, బైకులకు మాత్రమే స్థలం ఉంది. అందుకే వాహనాలను కిందనే ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రాంతాలకు తరలించనున్నారు. ఇటు కనకదుర్గానగర్‌లో పనులు జరుగుతుండటంతో.. ఆ ప్రాంతానికి వాహనాలను అనుమతించరు. ఆయా ప్రదేశాల్లో పార్కింగ్‌ బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు అధికారులు.