iDreamPost
android-app
ios-app

పురంధేశ్వరిపై మరోసారి విజయసాయి రెడ్డి పొలిటికల్ కౌంటర్!

  • Published Nov 16, 2023 | 5:37 PM Updated Updated Nov 16, 2023 | 5:37 PM

వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో ప్రతిపక్షాలపై విరుచక పడుతుంటారు.తాజాగా రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో ప్రతిపక్షాలపై విరుచక పడుతుంటారు.తాజాగా రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Nov 16, 2023 | 5:37 PMUpdated Nov 16, 2023 | 5:37 PM
పురంధేశ్వరిపై మరోసారి విజయసాయి రెడ్డి పొలిటికల్ కౌంటర్!

సాధారణంగా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం  ఉంటుంది. చాలా తక్కువ సమయం మాత్రమే వ్యక్తుల మధ్య వార్ నడుస్తోంది. అయితే రాజకీయా నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్న ఘటనలు అనేకం  జరిగాయి.  కొందరు నేతలు సై అంటే సై చర్చలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఏపీలో వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి  మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇప్పటికే వారిద్దరి మధ్య పలుమార్లు ట్విట్టర్ వేదికగా పలుమార్లు ఆరోపణలు చేసుకున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపణలకు విజయసాయి రెడ్డి తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా పురంధేశ్వరికి వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. చెల్లెమ్మ పురంధేశ్వరి.. మిమ్మల్ని దేవుడు క్షేమిస్తాడా? అంటూ  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని…మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదిక చంద్రబాబుకు శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా?, భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ వ్యవహారంపై  కూడా పురంధేశ్వరి గురించి ప్రస్తావిస్తూ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ అని సెటైర్ వేశారు. మీ అందరి ఆస్తులు, నివాసాలు తెలంగాణలో ఉన్నాయి.. కాబట్టి.. అక్కడ కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట అనే వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బీజేపీ గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారంటూ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేశారు. అలానే సీఎం జగన్ , విజయ సాయిరెడ్డి బెయిల్ విషయంలో సీజేఐకి లేఖ కూడా రాసింది. అయితే ఆమె బీజేపీ అభివృద్ధి కంటే టీడీపీ కోసమే పని చేస్తున్నట్లు కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.  కారణం.. ఆమె రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన దగ్గర నుంచి బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు  చేసిన దాఖలాలు లేవు. కానీ, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. లోకేశ్ తో కలిసి కేంద్ర మంత్రులను కలిశారు. ఇలా ఆమె కేవలం మరిది కోసమే తాపత్రయ పడుతుందని, కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన  చంద్రబాబుకు కత్తి అందించింది.. పురంధేశ్వరేనని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి కూడా పురంధేశ్వరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరి.. పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి చేసిన వాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio