iDreamPost
android-app
ios-app

వంగవీటి ఇంట్లో పెళ్లి సందడి.. పెళ్లి చేసుకోబోతున్న రాధాకృష్ణ

  • Published Aug 16, 2023 | 10:54 AM Updated Updated Aug 16, 2023 | 10:54 AM
  • Published Aug 16, 2023 | 10:54 AMUpdated Aug 16, 2023 | 10:54 AM
వంగవీటి ఇంట్లో పెళ్లి సందడి.. పెళ్లి చేసుకోబోతున్న రాధాకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న వంగవీటి రాధాకృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ప్రభాస్‌ పెళ్లి గురించి ఎలా చర్చించుకుంటారో.. ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా పెళ్లి గురించి కూడా అదే రేంజ్‌లో చర్చించుకుంటారు. అనేక ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రశ్నించినప్పటికి.. ఆయన మాత్రం చిరునవ్వే సమాధానంగా ఇచ్చేవారు. ఇక ఇన్నాళ్లకు వంగవీటి రాధా పెళ్లి కన్ఫామ్‌ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో రాధా వివాహం జరుగుతుందని.. ఈ నెల 19న నిశ్చితార్థం వేడుక జరగబోతుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి, ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అధికారిక ప్రకటన వెలువడలేదు.

వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా వివాహం.. నర్సాపురంకు చెందిన యువతితో జరగబోతుందని సమాచారం. ఈ నెల 19న సర్సాపురంలో ఎంగేజ్‌మెంట్‌ వేడుక నిర్వహిస్తారని.. సెప్టెంబర్‌ 6న వివాహం జరగబోతుందని తెలుస్తోంది. అయితే రాధా వివాహం విజయవాడలో లేదంటే.. బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సన్నిహితులు తీసుకువచ్చిన సంబంధాన్ని వంగవీటి రాధా అంగీకరించారని తెలుస్తోంది. నర్సాపురంకు చెందిన స్నేహితుల బంధువుల తరఫు యువతితో రాధా పెళ్లి జరగబోతుంది ఆయన సన్నిహితులు తెలిపారు.

మరి ఈ వివాహ వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తారా.. లేదంటే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా చేస్తారా అనే విషయాల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రాధా వివాహం చేసుకోబోయే యువతి గురించి కూడా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. వంగవీటి రాధా పెళ్లి చేసుకుంటున్నారనే వార్త తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.