Arjun Suravaram
AP Medical And Health: ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి కూడా ఏపీలోని వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును ప్రశంసించారు.
AP Medical And Health: ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి కూడా ఏపీలోని వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును ప్రశంసించారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ అవినీతి అనేది లేకుండా..సంక్షేమ ఫలాలు ప్రజలకే అందేలా చేయడం సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ఇక విద్యా, వెద్య రంగంలో ఆయన చేపట్టిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్స సంఖ్యలను పెంచి పేదవాళ్లకి వైద్యని అందుబాటులోకి తెచ్చారు. అలానే ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల వద్దకే వైద్యం తీసుకెళ్లారు. ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. ఇక ఆయన పరిపాలనకు, పనితీరుకు దేశం నమూలల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే విద్యా, వ్యవసాయం, వైద్య రంగాల్లో ఏపీ పనితీరుకు ప్రశంసలు దక్కాయి. తాజాగా కేంద్రమంత్రి కూడా ఏపీలోని వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును ప్రశంసించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ.. వైద్య, ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చుకున్నారు. ఆరోగ్య రంగంపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్య విషయంలో కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మన్ సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని మాండవీయ అభిప్రాయం వ్యక్తం చేశారు.
శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఏపీలో పర్యటించారు. విజయవాడ, గుంటూరు మంగళగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రి, జీజీహెచ్, ఎయిమ్స్ లను ఆయన సందర్శించారు. విజయవాడలోని పాత జీజీహెచ్ లో రూ.25 కోట్లతో నిర్మించనున్న అత్యవసర విభాగాన్ని, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంను ఆయన పరిశీలించారు. తర్వాత మంగళగిరిలోని ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యకరమైన సమాజం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 10 రకాల పరీక్షలు నిర్వహిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. ఇక ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో చక్కగా పని చేస్తోందని కితాబిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రం ఆరోగ్య సేవలకు చేసే ఖర్చుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడబోదు అని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఈ పర్యటనలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడదల రజని, ఎంపీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి.. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ పనితీరుపై కేంద్ర మంత్రి ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.