iDreamPost

Palnadu District: APలో అరుదైన వ్యాధి! పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు!

Hemoglobin D Punjab: కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది.

Hemoglobin D Punjab: కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది.

Palnadu District: APలో అరుదైన వ్యాధి!  పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు!

కాలంలో మార్పులు రావడంతో ప్రపంచం వ్యాప్తంగా అనేక కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రకాల వ్యాధులకు జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే అనేక రకాల వింత వ్యాధులు వచ్చి జనాలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. కొత్త వ్యాధులతో పాటు ఎక్కడొ కనిపించే అతి అరుదైన వ్యాధులు కూడా ఇతర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు కలవరపాడుకు గురవుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో కూడా ఓ అరుదైన వ్యాధి బయటపడింది. ఎక్కడో నార్త్ ఇండియా రాష్ట్రమైన పంజాబ్ లో అరుదుగా కనిపించే వ్యాధి అందరిని కలవర పెడుతుంది. మరి.. ఈ వ్యాధి అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. మహా అయితే పక్కన ఉన్న ప్రాంతంలో ఆ వింత వ్యాధుల లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ సంబంధం లేని ప్రాంతాల్లో వ్యాధి బయటపడినప్పుడు అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మనదేశంలో పంజాబ్ రాష్ట్రంలో సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే వ్యాధి  అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఆ వ్యాధి ఇప్పుడు పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు పిల్లల్లో సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే ఈ వ్యాధిని గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

సోమవారం జీజీహెచ్ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వ్యాధికి సంబంధించిన పలు విషయాలను, అలానే పిల్లలకు సోకిన అంశాలను వెల్లడించారు. శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు రక్తహీనత సమస్యతో ఇటీవల ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. ఈక్రమంలో ఆ పిల్లల ఇద్దరికి వైద్యులు రక్త పరీక్షలు చేయగా ఈ అరుదైన వ్యాధి విషయం బయటపడిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇది చాలా అరుదైన వ్యాధిగా వైద్యులు తెలిపారు. దీనికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే సరైన చికిత్సని  ఆయన తెలిపారు.

ప్రస్తుతం జీజీ ఆస్పత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ ఫ్లాంటేషన్ విధానం అందుబాటులో లేదని వివరించారు. ప్రస్తుతం రెడ్ సెల్స్ ఎక్కించడం ద్వారా తాత్కాళికంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ చిన్నారుల్లో ఈ అరుదైన వ్యాధి బయటపడటంతో శ్రీరాంపుర తండా పరిసరాల్లోని చిన్నారులందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆ టెస్ట్ ల ద్వారానే ఇంకా ఎంతమందిలో ఇలాంటి సమస్య ఉందనే విషయం బయటకు వస్తుందని తెలిపారు.

సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అంటే ఏమింటంటే.. ఇదో  జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉంటే వారికి పుట్టే పిల్లలకు వంశపారపర్యంగా సంక్రమించే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ వ్యాధి సోకిన వారిలోని రక్తంలో హిమోగ్లోబిన్ 5శాతం కంటే తక్కువగా ఉంటుంది. రెడ్ సెల్స్ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దీంతో  ఈ వ్యాధికి గురైన వారు ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు.  అంతేకాక త్వరగా అలిసిపోతుంటారు. ఈ వ్యాధి పాకిస్థాన్, భారత్ లోని పంజాబ్ ప్రాంతం, నార్త్ చైనా, నార్త్ అమెరికా వంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇండియాలో పంజాబ్ ప్రాంతంలో అప్పుడప్పుడూ ఈ వ్యాధి వెలుగుచూస్తూ ఉంటుంది. అందుకే దీనిని సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అని పిలుస్తుంటారు. మొత్తంగా ఎక్కడొ పంజాబ్ లో కనిపించే ఈ వ్యాధి ఏపీలో బయటపడటంతో పల్నాడు వాసులు కలవరపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి