iDreamPost
android-app
ios-app

వీడియో: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. బైక్ తో సహ కొట్టుకుపోయిన యువకులు!

గతకొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్దృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేసి..కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

గతకొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్దృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేసి..కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వీడియో: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. బైక్ తో సహ కొట్టుకుపోయిన యువకులు!

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వానాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఇక ఈ భారీ వానాల కారణంగా నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వాటిని దాటే ప్రయత్నం చేసి..ప్రమాదంలో చిక్కుకుంటారు. కొన్ని రోజుల క్రితం ఓ ఫ్యామిలో నదిలో చిక్కుకుని చివరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. అలానే ముగ్గురు యువకులు సెల్పీ కోసం జలశాయం సమీపంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.  ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రాంతంలో బైక్ తో సహా ఇద్దరు యువకులు నదిలోకి కొట్టుకోపోయారు. ఇక చివరకి ఏమైందంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరదల కారణంగా ఓ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇదే సమయంలో అటుగా ఇద్దరు యువకులు వెళ్లారు. వాగు ఉధృతిని అంచనా వేయలేకపోయారు. అలానే ఆ ఇద్దరు యువకులు బైక్ పై వాగును దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వాగును దాటేందుకు బైక్ తో సహా ముందుకు వెళ్లారు. ఇక వాగు ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో బైక్ తో సహా వారు వాగులో కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తు స్థానికులు అక్కడే ఉన్నారు.

ఆ యువకులు నదిలో కొట్టుకోపోవడాన్ని గమనించి వెంటనే స్పందించాంరు. నీటిలో కొట్టుకుపోతున్న వారిద్దరిని బయటకు లాగి కాపాడారు. లేదంటే వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వాగులు, వంకలు పారతున్న చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. అయినా కొందరు ఆ మాటలు లెక్కచేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా వాగులు దాటే సమయంలో వాటి ప్రవాహాన్ని అంచనా వేయలేక..అందులోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.

వరదల కారణంగా ఆదివారం ఢిల్లీలో ఘోరం జరిగిన సంగతి తెలిసింది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు వరదల నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వారు కోచింగ్ తీసుకుంటున్న భవనంలోనిసెల్లార్ లోకి వరదనీరు రావడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఢిల్లీలో నిబంధనకు విరుద్దంగా ఉన్న 13 సివిల్స్ కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. ఇలా వరదల సమయంలో అప్రమత్తంగా లేకపోతే.. పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా నదులు, వాగుల వద్ద, కరెంట్ స్తంభాల వద్ద వానల సమయంలో  ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అలానే జలపాతల వద్దకు వెళ్లే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అజాగ్రత్త, అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఎంతో మంది అమాయకలు ప్రాణాలు కోల్పోయారు.