iDreamPost

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం!

YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక సంస్కరణలు చేశారు. అలానే విద్యార్థులకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంటారు. తాజాగా 8వ తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పనున్నారు.

YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక సంస్కరణలు చేశారు. అలానే విద్యార్థులకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంటారు. తాజాగా 8వ తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పనున్నారు.

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం జగన్ సంకల్పించారు. అందుకే వారికి ఇంగ్లీష్ మీడియం విద్యాను ప్రవేశపెట్టారు. చదువుకునే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రాకుండా అన్ని తానై చూసుకున్నారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న కానుక, జగనన్న విద్యా దీవెన వంటి అనేక పథకాలను విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో వారికి తరచూ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా ప్రభుత్వ పాఠశాల్లోని 8వ తరగతి విద్యార్థులకు సీఎం  శుభవార్త చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి… విద్యార్థులకు మంచి విద్యను అందించే విషయంలో ఎక్కడ రాజీ  పడటం లేదు. ఇప్పటికే నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేశారు. అంతేకాక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా,  ఎల్లో మీడియా వ్యతిరేకిస్తున్నా సర్కారీ బడుల్లో  ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. అలానే విద్యార్థులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడకూడదని వివిధ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు.

అలానే విద్యార్థులకు పాఠ్యాంశాలు చక్కగా అర్ధమయ్యేందుకు ట్యాబ్ లను సైతం పంపిణీ చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎంతో కృషి చేశారు. విద్యా రంగంలో తనదైన మార్క్ ను చూపించారు. తాజాగా రేపు 8వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పనున్నారు. గురువారం అల్లూరి సీతారామా రాజు జిల్లా లో సీఎం జగన్ పర్యటించనున్నారు. అక్కడ 8వ తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబ్ లు అందజేస్తారు. ఉదయం 8.30 గటంలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లిలోని చౌడుపల్లి చేరుకుంటారు.

అక్కడి నుంచి చింతపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో ముచ్చటిస్తారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందజేస్తారు. ఆ తరువాత చౌడుపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి… విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి