Tomato Price: సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన టమాట ధర.. కిలో ఎంతంటే

సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతోంది టమాటా. గతేడాదిలానే ఈసారి కూడా ధర భారీగా పెరుగుతుంది. ఇక నేడు టమాటా కిలో ధర ఎంత ఉందంటే..

సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతోంది టమాటా. గతేడాదిలానే ఈసారి కూడా ధర భారీగా పెరుగుతుంది. ఇక నేడు టమాటా కిలో ధర ఎంత ఉందంటే..

గత ఏడాది టమాటా సాగు చేసిన రైతులు కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారు. పోయిన ఏడాది కూడా సరిగ్గా ఇదే సమయంలో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో ఏకంగా 150 రూపాయల వరకు కూడా చేరింది. దాంతో టమాటా సాగు చేసిన రైతుల పంట పండితే.. సామాన్యులు మాత్రం.. టమాటాను చూస్తేనే భయపడ్డారు. చాలా మంది కొన్ని రోజుల పాటు టమాటా వాడాలంటే.. ఆలోచించారు. అసలు కొనలేదు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉందంటే.. అదే సీన్‌ రిపీట్‌ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వేసవిలో టమాటా ధర కిలో 10 రూపాయలుకు పడిపోగా.. గత రెండు వారాల నుంచి ధర పుంజుకుంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో టమాటా రేటు చూస్తే.. అమ్మో అనిపించకపమానదు. మరి కిలో ధర ఎంత పెరిగిందంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు సామాన్యులకు షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర 55-60 రూపాయల మధ్య ఉంది. చిత్తూరు జిల్లా అంగళ్లు టమాటా మార్కెట్‌లో 25 కిలోల బాక్స్‌.. 1400 రూపాయలు పలికింది. అంటే కిలో టమాటా ఏకంగా రూ.56 కు చేరింది అన్నమాట. ఇక మదనపల్లి టమాటా మార్కెట్‌ యార్డ్‌లో 25 కిలోల బాక్స్‌ 1300 పలికి.. కిలో టమాటా 52 రూపాయల వరకు చేరింది. అలానే పుంగనూరు, మొలకలచెరువు మార్కెట్‌ యార్డ్‌లో కూడా టమాటా ధరలు భారీగా పెరిగాయి.

టమాటా ధరలు ఒక్కసారిగా దూసుకుపోతుండటంతో.. దాన్ని సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ సామాన్యులు, పేద, మధ్య తరగతి జనాలు టమాటా కొనాలంటేనే అమ్మో అంటున్నారు. మళ్లీ గతేడాది పరిస్థితులే వస్తాయా అని భయపడుతున్నారు. మరి టమాటా ధర ఎందుకు ఇంతలా పెరిగింది అంటే.. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిశాయి. దాంతో సాగునీటికి కొరత ఏర్పడింది.

వీటికి తోడు తెగుళ్లు, గిట్టుబాటు ధర లభించకపోవడందో.. చాలా మంది రైతుల కూరగాయల సాగుపై ఆసక్తి చూపడం లేదు. గతంలోలానే ఈ ఏడాది కూడా టమాటా సాగు, దిగుబడి తగ్గడంతో.. ధరలు పెరిగాయి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలానే ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా రేటుతో పాటు ఇతర కూరగాయాల ధరలు కూడా మండిపోతున్నాయి.

Show comments