iDreamPost
android-app
ios-app

భర్తకి అండగా కష్టపడాలని భార్య ఆరాటం! మరోలా విధిరాత!

  • Published Mar 11, 2024 | 5:10 PM Updated Updated Mar 11, 2024 | 5:10 PM

Vizianagaram Crime News: తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవాలని భావించింది ఓ మహిళ. కానీ విధిరాత మరోలా మరిపోయింది.

Vizianagaram Crime News: తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవాలని భావించింది ఓ మహిళ. కానీ విధిరాత మరోలా మరిపోయింది.

  • Published Mar 11, 2024 | 5:10 PMUpdated Mar 11, 2024 | 5:10 PM
భర్తకి అండగా కష్టపడాలని భార్య ఆరాటం! మరోలా విధిరాత!

ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తన ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారి కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం ఎక్కడో అక్కడ వాహనదారులు పొరపాటు చేస్తూనే ఉన్నారని అధికారులు అంటున్నారు. పాలకొండ రూరల్‌ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.

పాలకొండ రూరల్‌ లుంబూరి వారి వీధికి చెందిన దుప్పాడ కుమారి (28) రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. తమ కుటుంబాన్ని భర్త సింహాద్రి ఒక్కడే పోషిస్తు వస్తున్నారు. తన భర్తకు సాయంగా తాను కూడా కష్టపడాలని నిర్ణయం తీసుకుంది కుమారి. ఈక్రమంలోనే మండంలోని పణుకువలస సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆదివారం కంపెనీలో పని ఉండటంతో రోజూ లాగా పయణమైంది. తనతోపాటు ఆ కంపెనీలో పని చేస్తున్న శ్రీరాంమూర్తి అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో రాజుపేట వద్దకు రాగానే.. రోడ్డు పై హఠాత్తుగా ముంగీస అడ్డు రావడంతో సడెన్ బ్రేక్ వేయడంతో బైక్ స్కిడ్ అయి పడిపోయింది.

ఈ ప్రమాదంలో కుమారి పక్కనే ఉన్న రాళ్లపై పడి తలకు తీవ్ర గాయం కావడంతో ఆపస్మారక స్థితికి చేరుకుంది. వెనుక ఆటోలో వస్తున్న ఆమె సహ ఉద్యోగులు అది గమనించి వెంటనే కుమారిని ఆటోలో పాలకొండ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. శ్రీరాంమూర్తి కి స్వల్ప గాయాలతో బయటపడగా కుమారి పరిస్థితి విషమించడంతో డాక్టర్లు శ్రీకాకుళం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారి కన్నుమూసింది. ఆమెకు ఇద్దరు కుమారులు. ఎంతో సంతోషంగా ఉన్న తన కుటుంబంలో ఇలా విషాదం నిడటంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet