iDreamPost
android-app
ios-app

AP హైకోర్టు జడ్జి కారు బోల్తా.. జస్టిస్ సుజాతకు గాయాలు..

AP హైకోర్టు జడ్జి కారు బోల్తా.. జస్టిస్ సుజాతకు గాయాలు..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వలన ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే పలువురు ప్రముఖులు కూడా ఈ ప్రమాదాలకు గురై..మృతి చెందారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదానికి గురై..మరణించారు. తాజాగా ఏపీ హైకోర్టు జడ్డి కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో జడ్జీకి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తివివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వడ్డిబోయిన సుజాత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. సూర్యాపేట-కోదాడ జాతీయ రహదారిపై గుంపుల అనే గ్రామం సమీపంలో జస్టిస్‌ సుజాత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైకోర్టు జడ్జి సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తన కారులో బయలుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న కారు రాత్రి 7.30గంటల సమయంలో..సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని తిరుమలగిరి సమీపంలోని జాతీయ రహదారి 65పై అదుపు తప్పి బోల్తా పడింది.

వర్షం కారణంగా టైర్లు జారీ అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో జస్టిస్ సుజాత తలకు గాయాలయ్యాయి. అయితే ఆమె గనమెన్, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలుకాలేదు. సమాచారం అందుకున్నపోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన జడ్జి సుజాతను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. జడ్జిని తెలంగాణ మంత్రి జగదీ‌ష్‌రెడ్డి స్వయంగా తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş