iDreamPost
android-app
ios-app

కానిస్టేబుల్ దారుణం: భర్తను జైలులో బంధించి.. భార్యను లైంగికంగా..

  • Published Feb 13, 2024 | 9:25 PM Updated Updated Feb 13, 2024 | 9:25 PM

దేశంలో ప్రతిరోజూ మహిళలై లైంగిక వేధింపులు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది.

దేశంలో ప్రతిరోజూ మహిళలై లైంగిక వేధింపులు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది.

కానిస్టేబుల్ దారుణం: భర్తను జైలులో బంధించి.. భార్యను లైంగికంగా..

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా కామంతో రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళా సంఘాలు. నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలను తీసుకువచ్చారు.. కానీ కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. లైంగిక వేధింపులు, అత్యాచారాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. మహిళలకు రక్షణ కల్పించాల్సిన కొంతమంది పోలీసులు అన్యాయాలకు తెగబడుతున్నారు. అలాంటి ఘటనే ఏపీలో చోటు వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని పల్నాడు జిల్లాలో అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ అతని భార్యపై కన్నేశాడు. అంతటితో ఆగకుండా భర్తను జైల్లో బంధించి అతని భార్యపై లైంగికదాడికి పాల్పపడ్డాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో తీవ్ర కలకలం రేగింది. బాధితురాలు ఈ విషయంపై మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో వెంకట్ నాయక్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత జనవరి నెలలో ఓ దొంగతనం కేసుకింద బాధిరాలి భర్తను తీసుకువచ్చాడు. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏం జరుగుతుందో అని అతని భార్య భయపడిపోయింది. ఆమె భయాన్ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ వేశాడు కానిస్టేబుల్ వెంకట్.

బాధితురాలికి ఈ కేసు విషయంలో సహాయం చేస్తానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. కానిస్టేబుల్ మాటను నమ్మింది బాధితురాలు. ఈ క్రమంలోనే ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పపడ్డాడు.. ఆ సమయంలో తాను మూడు నెలల గర్బవతిని అని చెప్పినా వినిపించుకోకుండా కామంతో రెచ్చిపోయినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనకు అబార్షన్ అయ్యిందని కన్నీరు పెట్టుకుంది. ఇటీవల తన భర్త బెయిల్ పై బయటకు వచ్చాడని.. తనని ఇంకా కానిస్టేబుల్ వేధిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ పై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో వెంకట నాయక్ పై ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది.