iDreamPost
android-app
ios-app

Kakinada: రాత్రుళ్లు కాకినాడ వీధుల్లో నగ్నంగా పరుగులు.. భయం భయంగా జనం!

ఇది ఆధునిక డిజిటల్ యుగం. సాంకేతికతను అందిపుచ్చుకుని మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి కాలంలో కూడా ఓ గ్రామంలో ఓ వింత ఘటన అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. రాత్రుళ్లు వింత శబ్దాలు, అరుపులు రావడంతో ఊరు వదలి వెళ్తిపోతున్నారు. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరిగిదంటే..

ఇది ఆధునిక డిజిటల్ యుగం. సాంకేతికతను అందిపుచ్చుకుని మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి కాలంలో కూడా ఓ గ్రామంలో ఓ వింత ఘటన అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. రాత్రుళ్లు వింత శబ్దాలు, అరుపులు రావడంతో ఊరు వదలి వెళ్తిపోతున్నారు. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరిగిదంటే..

Kakinada: రాత్రుళ్లు కాకినాడ వీధుల్లో నగ్నంగా పరుగులు.. భయం భయంగా జనం!

ప్రస్తుతం నడుస్తున్నది ఆధునిక యుగం, ఇంకా చెప్పాలంటే డిజిటల్ యుగం. ఇక్కడ రోజూ రోజూకు కొత్త టెక్నాలజీలు మనకు పరిచయం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించి మనిషి తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు. అంతేకాక టెక్నాలజీని అందిపుచ్చుకుని మానవుడు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రపంచంతో పోటీ పడుతూ ఊహకందని విధంగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి యుగంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వెంకటాడుతూనే ఉన్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలోని కాండ్రకోట గ్రామం ఇలాంటి విషయంతోనే వార్తల్లో నిలిచింది. అక్కడ అర్థరాత్రి సమయంలో వింత శబ్దాలు, నగ్నంగా పరుగులు పెడుతున్న వ్యక్తి.. ఇలా ఆ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరి.. అక్కడే ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం సమీపంలో కాండ్రకోట అనే గ్రామం ఉంది. ప్రస్తుతం ఈ ఊరితో పాటు పరిసర గ్రామాలు కూడా వార్తల్లో వినిపిస్తోన్నాయి. కారణంగా.. ఈ ప్రాంతంలోని కొందరు ఊళ్లను వదిలి వెళ్లిపోతున్నారు.  అంతేకాక మరికొందరు  చీకటిపడిన తరువాత బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇంకొందరు నిద్రపోకుండా తెల్లవార్లూ ఊర్లో తిరుగుతూ కాపల కాస్తున్నారు. ఇలా వీరందరు చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.

కాండ్రకోట, పరిసర గ్రామాల్లో చీకటి పడగానే వింత శబ్దాలు వినిపిస్తోన్నాయి. అంతేకాక ఇళ్ల ముందు ముగ్గులు వేసి, దీపాలు వెలుగుతున్నాయి. మరికొందరికి.. ఎవరో నగ్నంగా పరిగెడుతున్న దృశ్యాలను కనిపించాయి. ఇలా చీకటి పడిన తరువాత జరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఊర్లో దెయ్యాలు తీరుగుతున్నాయని , అవే ఇళ్ల ముందు వచ్చి ముగ్గులు వేసి వెళ్తున్నాయంటూ వీడియోలను సైతం చూపిస్తున్నారు. ఇలా వింత శబ్దాలకు బయటపడిన జనం చీకటి పడితే ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు గజగజ వణికిపోతున్నారు.

 మరికొందరు అయితే ఆ దృష్ట శక్తి, ఆ వింత శబ్దాలు చేసేది ఎవరో కనిపెట్టేందుకు తెల్లవార్లు ఊర్లలో కాపాల కాస్తున్నారు. స్థానిక యువకులు, పెద్దలు కర్రతో ఊర్లల్లో రాత్రంతా తిరుగుతూ కాపాల కాస్తున్నారు. తాము నగ్నంగా పరిగెడుతున్న వ్యక్తిని చూశామని, అరిచేసరికి పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. అలానే  సాయంత్రం చీకటి పడగానే పెద్దగా వింత అరుపులు వినిపిస్తోన్నాయి, అదే సమయంలో కుక్కలు కూడా పెద్దగా అరుస్తున్నాయని, దెయ్యం రావడంతోనే ఇలా జరుగుతుందని మరికొందరు అభిప్రాయాపడుతున్నారు. ఇలా తమ ఊరిపై దృష్ట శక్తుల ప్రభావం ఉందని చాలా మంది గ్రామాలను వదలి పారిపోతున్నారు.  అలానే చాలా మంది స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో యాగాలు, పూజలు చేస్తున్నారు.

ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న నిపుణులు గ్రామాణినికి చేరుకున్నారు. దెయ్యాలు, ఇతర దృష్ట శక్తులు వంటివి లేవని, కేవలం అది మన భ్రమని వారు కొట్టి పారేస్తున్నారు. నిజంగా అలాంటిది ఉంటే.. మనం అరవగానే మాయమై పోవాలి కానీ, పరుగులు తీయదు కదా అంటూ వారు చెప్పుకొచ్చారు. ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అలాంటి మూఢ విశ్వాసలను నమ్మకూడనదని, నిజంగా ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం కనుకోవాలే కానీ భయాందోళనకు గురికాకూడదని వారు తెలిపారు.

అలానే ఈఘటనపై పోలీసులు కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. ఈ గ్రామాలకు సంబంధించినది కాదని, అది ఫేక్ వీడీయో అని తెలిపారు. అంతేకాక ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయోద్దని, ఏదైన సమస్య ఉంటే తమ ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఎవరి మాటలు ఎలా ఉన్నా.. ఆ ప్రాంతంలో మాత్రం వింత శబ్దాలు, అరుపులు, నగ్నంగా  పరుగులు పెడుతున్న దృశ్యాలు స్థానికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. మరి.. ఈ ఇష్యూ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందో అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది. మరి.. కాంట్రకోటలో జరుగుతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.