iDreamPost
android-app
ios-app

వీడియో: అక్కపై గొడ్డలితో దాడికి తెగబడ్డ తమ్ముడు! కారణం ఏంటంటే..?

  • Published Jul 10, 2024 | 10:58 AM Updated Updated Jul 10, 2024 | 10:58 AM

ఇటీవల కాలం మాత్రం మానవ సంబంధాలు అనేవి కనుమరుగై పోతున్నాయి. ఆస్తుల, ఆర్థిక సంబంధాల, ఇతర శారీరక సంబంధమైన విషయంలో తోడబుట్టిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు.

ఇటీవల కాలం మాత్రం మానవ సంబంధాలు అనేవి కనుమరుగై పోతున్నాయి. ఆస్తుల, ఆర్థిక సంబంధాల, ఇతర శారీరక సంబంధమైన విషయంలో తోడబుట్టిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు.

  • Published Jul 10, 2024 | 10:58 AMUpdated Jul 10, 2024 | 10:58 AM
వీడియో: అక్కపై గొడ్డలితో దాడికి తెగబడ్డ తమ్ముడు! కారణం ఏంటంటే..?

అన్ని బంధాల్లోకి రక్త సంబంధం ప్రత్యేకమైనది. జీవితంలో చాలా వరకు మనకు ఇష్టమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. కానీ రక్తసంబంధికులను మాత్రం ఆ దేవుడే ఇస్తాడు. అందుకే చాలా వరకు కుటుంబ సభ్యులు కలిసి మెలసి ఉంటారు.  ఎవరికి కష్టమెచ్చిన స్పందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కాలం మాత్రం మానవ సంబంధాలు అనేవి కనుమరుగై పోతున్నాయి. ఆస్తుల, ఆర్థిక సంబంధాల విషయంలో తోడబుట్టిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు అయితే హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అక్కపై సొంత తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో  మహబూబి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు  జిలాని అనే తమ్ముడు ఉన్నాడు. వీరికి గ్రామంలోని ఓ ఇంటి స్థలం విషయంలో తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో మహబూబి తమ్ముడు జిలాని దారుణానికి ఒడిగట్టాడు. అక్క అని చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అక్క మహబూబిపై జిలాని గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆమె చేతులను అడ్డుపెట్టింది. అయినా వదలకుండా ఆమె చేతులు, కాళ్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

అక్కపై జిలానీ దాడి చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న వారి కుటుంబ సభ్యులురాలు ఆపే ప్రయత్నం చేసింది. అయినా  ఆమెను పక్కకు నెట్టేసి.. తిరిగి మరోసారి అక్కపై దాడికి యత్నించాడు. ఈ దాడిని అక్కడే ఉన్న స్థానికులు ఒకరు ఫోన్ లో రికార్డు చేశారు.  ఇక దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక నిందితుడు జిలానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలానే అనంతపురం జిల్లాలోనే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss