P Krishna
Kurnool Crime News: ఇటీవల కొంతమంది యువకులు జులాయిగా తిరుగుతూ రౌడీయిజానికి అలవాటు పడి అమాయకులపై దాడులకు తెగబడుతున్నారు.
Kurnool Crime News: ఇటీవల కొంతమంది యువకులు జులాయిగా తిరుగుతూ రౌడీయిజానికి అలవాటు పడి అమాయకులపై దాడులకు తెగబడుతున్నారు.
P Krishna
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రౌడీయిజం రంకెలు వేస్తుంది. కొంతమంది యువకులు చదువు సంద్యలు లేక రోడ్లపై జులాయిలా తిరుగూత రౌడీయిజం చేస్తూ అమాయకులను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఎదురు తిరిగిన వాళ్లపై మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీరిలో మార్పు రావడం లేదు. డోన్ లో ఓ దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. గర్భిణి అని చూడకుండా కొంతమంది రౌడీ గ్యాంగ్ పాశవికంగా దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లా డోన్ లో కొంతమంది గ్యాంగ్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఆర్ఎంపీ బాలు గ్యాంగ్ పలు దారుణాలకు తెగబడుతున్నారు. తనకు అడ్డు వచ్చిన వాళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ పలుమార్లు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కేస్తున్నాడు. ఇప్పటికే బాలుపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల ఆయనకు వ్యతిరేంగా వాదిస్తున్న లాయర్ పై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన మరువక ముందే.. శుక్రవారం రాత్రి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మంజిరాబాదు లో తాగిన మైకంలో బారులో వస్తువులు ధ్వంసం చేస్తుండగా ప్రభాకర్ అనే ఉద్యోగి అడ్డుకున్నాడు. ఆ సమయంలో బాలు చేతికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఉదయం 7 గంటల ప్రాంతంలో బాలు తన అనుచరులతో ప్రభాకర్ తమ్ముడు విజయ్ ఇంటిపై కత్తులు, ఇనున రాడ్లు, బీరు సీసాలతో వెళ్లి దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో 8 నెలల గర్భవతి అయిన విజయ్ భార్య అడ్డు వచ్చింది. తన భర్తను ఏం చేయవొద్దని ప్రాదేయపడింది. కానీ దుర్మార్గుడైన బాలు అతని అనుచరులు గర్భవతి అని చూడకుండా ఆమెపై కూడా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి బాగాలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలు గ్యాంగ్ పై కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం బాలు అతని గ్యాంగ్ పరారీలో ఉన్నారని.. త్వరలో పట్టుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.