నేటికాలంలో రక్తబంధాలకు విలువ లేకుండా పోతుంది. బంధాల కంటే నోట్ల కట్టలకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆస్తులు, డబ్బుల కోసం సొంత వారిని హతమారుస్తున్నారు. గత నెలలో ఆస్తి విషయంలో కట్టుకున్న భార్యనే రెంచితో కొట్టి మరీ చంపేశాడు ఓ వైద్యుడు. అలానే కొడలిని రాడ్డుతో దాడి చేసి చంపాడు ఓ మామ. ఇలా చెప్పుకుంటూ పోతే ధనం కారణంగా జరుగుతున్న ఘోరాలకు లెక్కేలేకుండా పోతుంది. తాజాగా సొంత మనువడిని తాతయ్య హత్య చేశాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తాతయ్యే ఆ బాలుడిని కాటేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదవారి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి తన కొడుకు కుటుంబతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. నాగేశ్వరావు కొడుకి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అయితే కొంతకాలం నుంచి కొడుకు, కోడలి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒకసారి పెద్దల వద్ద పంచాయితీ పెట్టించారు. అనంతరం కొన్ని రోజుల పాటు మాములుగానే ఉన్నారు. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో నాగేశ్వరావు కోడలు శిరీష.. భర్తతో విడిపోయేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తమ ఆస్తి మనవడికి వెళ్తాయని నాగేశ్వరావు, ఆయన కుమారుడు భావించారు. ఆ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడలకి చెందకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలుసార్లు నీ కొడుకును లేకుండా చేస్తాని.. తన మామ బెదరించినట్లు శిరీష ఆరోపించింది. ఇలా వారి గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నెల 9న మనవడిని ఇంట్లో నుంచి బయటకు తీసికెళ్లిన నాగేశ్వరావు.. గొంత నులిమి చంపేశాడు. అనంతరం మనవడి డెడ్ బాడీని సమీపంలోని కాలువలో పడేసి.. ఏమి తెలియనట్లు ఇంటికి వచ్చాడు. తన కొడుకేడని కోడలు ప్రశ్నించగా బెదరించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో తన కుమారుడు కనిపించడం లేదని శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. బాలుడిని నాగేశ్వరావు తీసుకెళ్లడం తాము చూసినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే సమీపంలోని కాలువలో బాలుడి డెడ్ బాడీ దొరికింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరి. ఆస్తుల ముందు రక్త సంబంధం ఓడిపోయిందని ఈ ఘటన చూసిన స్థానికులు అంటున్నారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: డాక్టర్ రాధ హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు!