iDreamPost
android-app
ios-app

భర్త కూలీ.. అతని భార్య మాత్రం హీరోయిన్ లా! హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ లో!

  • Published Mar 26, 2024 | 5:05 PM Updated Updated Mar 26, 2024 | 5:05 PM

ఎంతో మంది దంపతులు తమ పిల్లపాపలతో సంతోషంగా జీవిస్తుంటారు. అలానే దంపతులు ఒకరికొకరు తోడుగా ఉంటూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ సంసారాన్ని సాగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం క్షణికావేశంలో తమ పచ్చని సంసారాన్ని కాల్చేసుకుంటున్నారు.

ఎంతో మంది దంపతులు తమ పిల్లపాపలతో సంతోషంగా జీవిస్తుంటారు. అలానే దంపతులు ఒకరికొకరు తోడుగా ఉంటూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ సంసారాన్ని సాగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం క్షణికావేశంలో తమ పచ్చని సంసారాన్ని కాల్చేసుకుంటున్నారు.

  • Published Mar 26, 2024 | 5:05 PMUpdated Mar 26, 2024 | 5:05 PM
భర్త కూలీ.. అతని భార్య మాత్రం హీరోయిన్ లా! హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ లో!

భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది. పిల్లలు, తల్లిదండ్రులు  ఎవరు ఉన్నా.. చివరి వరకు కలిసి సాగేది మాత్రం వీరిద్దరే. భార్యాభర్తల బంధం అన్నాక గొడవలు, అలకలు సహజం. పూర్వం రోజుల్లో అయితే సంసారంలో ఎన్ని సమస్యలు వచ్చినా, తమ మధ్య ఎన్ని గొడవలు జరిగినా కాసేపటికి తిరిగి కలిసి పోతుంటారు. ఇంకా చెప్పాలంటే..చంపుకోవాలని, చావాలనే ఆలోచనలు ఆ కాలంలో వాళ్లకి ఉండేవి కావు. అయితే నేటి కాలంలో మాత్రం ప్రతి చిన్న విషయానికి భార్యభార్తలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు దంపతులు అయితే ఒకరినొకరు చంపుకునే స్థితికి వెళ్లారు. తాజాగా ఓ వివాహితను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువలు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా వలేటివారిపాళెం మండలం పోకూరుకు చెందిన చిమట శివకృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన లంబాల నాగేశ్వరరావు, ఎర్రమ్మ కుమార్తె వనజాక్షి(27)తో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివ కందుకూరు పట్టణంలోఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. శివకృష్ణ, వనజాక్షి దంపతులు పట్టణంలోని గాయత్రి నగర్ లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వనజాక్షి కూడ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ కుటుంబానికి సాయంగా ఉంటుంది. అలానే ఆటో నడపడం ఆపేసిన శివకృష్ణ.. ఇటీవలే ఓ ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడు. ఆ ట్రాక్టర్ ను అద్దెలకు తిప్పుతూ డబ్బులు సంపాదించేవాడు.

వనజాక్షి తల్లిదండ్రులు  నాగేశ్వరరావు, ఎర్రమ్మలు కూడా కందుకూరు పట్టణంలోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వనజాక్షి తల్లిదండ్రులు పట్టణంలోని గుండంకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో శివకృష్ణ, వనజాక్షిల సంసారం ఎంతో హాయిగా సాగిందట. అయితే ఇటీవల కొంతకాలం నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం కూడా వీరిద్దరు ఘర్షణ పడ్డారు. చిన్నగా మొదలైన వీరి గొడవ పెద్దగా మారింది. ఈ క్రమంలోనే వనజాక్షిని శివ కొట్టి చంపాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో వనజాక్షి తండ్రి నాగేశ్వరరావు ఆమెకు ఫోన్‌ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన వనజాక్షి తల్లిదండ్రులు తన కూతురు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు.

ఇంట్లోకి వెళ్లి చూడగా  వనజాక్షి శరీరంపై గాయాలై విగతజీవిగా ఉంది. కుమార్తెను విగతజీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్షణి కావేశంలో శివకృష్ణ చేసిన పనికి  వారి  కుమార్తెలు ఇద్దరు ఒంటరిగా మిగిలారు. మొత్తంగా కుటుంబ కలహాలతో ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. దంపతుల్లో సహనం, ఓర్పు, సర్థుకుపోయే గుణం లేకపోవడం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet