iDreamPost
android-app
ios-app

హాస్టల్‌లో 4వ తరగతి విద్యార్థి దారుణ హత్య!

  • Published Jul 11, 2023 | 10:37 AM Updated Updated Jul 11, 2023 | 10:50 AM
  • Published Jul 11, 2023 | 10:37 AMUpdated Jul 11, 2023 | 10:50 AM
హాస్టల్‌లో 4వ తరగతి విద్యార్థి దారుణ హత్య!

ఈ మధ్యకాలంలో చిన్నారులపై దారుణాలు జరుగుతున్నాయి. లైంగిక దాడులు, కిడ్నాప్, హత్యలు చేస్తున్నారు. అభంశుభం తెలియని పిల్లలను అత్యంత పాశవికంగా హత్య చేస్తున్నారు. పగలు, ప్రతీకారాలు వంటివి పెట్టుకుని పెద్దవాళ్లపై  ఉన్న కోపంతో ఏ పాపం  ఎరుగని పిల్లలను బలి చేస్తున్నారు. మరికొందరు మానవ మృగాలు పిల్లలను ఎత్తుకెళ్లి.. దారుణంగా హతమారుస్తున్నారు. ఇటీవలే బాపట్ల జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఏలూరు జిల్లాలోనూ ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఏలూరు జిల్లాలో నాలుగో తరగతి విద్యార్థి దారుణంగా హత్య చేశారు. ఏలూరు  జిల్లా పులిరామన్నగూడెంలోని గిరిజిన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ  అఖిల్(9) అనే విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు.  సోమవారం అర్థరాత్రి  సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అఖిల్ ను హత్య చేశారు.  అనంతరం అక్కడి నుంచి హంతకులు పరారయ్యారు. అఖిల్ ను గమనించిన హస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అలానే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి  చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే హాస్టల్ లో ఉండే విద్యార్థిని హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేగుతుంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంలో  ఏమైనా గొడవలు, మృతుడి తల్లిదండ్రులకు ఎవరితోనైన గొడవలు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా పాఠశాల విద్యార్థులు హత్యలకు గురికావడం అందరిని కలచి వేస్తోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేదు.. మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది చదవండి:  APలో ఘోర ప్రమాదం.. కాల్వలో పడినపెళ్లి బస్సు.. ఏడుగురు మృతి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş