iDreamPost
android-app
ios-app

దారుణం.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ముక్కలుగా నరికి..!

  • Published Mar 22, 2024 | 6:56 PM Updated Updated Mar 22, 2024 | 6:56 PM

నేటికాలంలో మనిషి రూపంలో ఉన్న మృగాలు సమాజంలో తిరుగుతున్నాయి. డబ్బు, బంగారం వంటి వాటి కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకునేందుకు కూడా ఆలోచించడం లేదు. తాజాగా 7 తులలా బంగారం కోసం ఓ వృద్దురాలిని ముక్కలుగా నరికేశారు.

నేటికాలంలో మనిషి రూపంలో ఉన్న మృగాలు సమాజంలో తిరుగుతున్నాయి. డబ్బు, బంగారం వంటి వాటి కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకునేందుకు కూడా ఆలోచించడం లేదు. తాజాగా 7 తులలా బంగారం కోసం ఓ వృద్దురాలిని ముక్కలుగా నరికేశారు.

  • Published Mar 22, 2024 | 6:56 PMUpdated Mar 22, 2024 | 6:56 PM
దారుణం.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ముక్కలుగా నరికి..!

మనిషి అనే వాడు మరుగవుతున్నాడు, మనిషిలో మృగం నిండుతుందని పెద్దలు అంటుంటారు. ఆ మాటలను నిజం చేస్తూ అనేక ఘటనలు ప్రస్తుతం కాలంలో జరుగుతున్నాయి. మనిషి ప్రాణం కంటే డబ్బులు, నగలు వంటి వాటికే విలువ ఎక్కువ అవుతోంది. సొమ్ము కోసం నిండు ప్రాణం తీయడానికి క్షణం కూడా ఆలోచించని కసాయి మనుషులు సమాజాంలో పెరిగిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 7తులాల బంగారం కోసం ఓ వృద్దురాలిని ముక్కులుగా నరికి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల అనే గ్రామంలో ఓబులమ్మ(84) అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె  కుమార్తె హైదరాబాద్ లో  స్థిర పడింది. చాలా రోజుల నుంచి ఓబులమ్మ ఒంటరిగా ఇంట్లో నివాసం ఉంటుంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దీంతో వాళ్ల ఇంట శుభకార్యం కోసం ఓబులమ్మ దాదాపు 7 తులాల బంగారు నగలను ఇచ్చింది. 15 రోజులు గడిచినా కృష్ణమూర్తి కుటుంబం తీసుకున్న బంగారాన్ని తిరిగి ఇవ్వలేదు. అలా వారిని అడిగి అడిగి ఓబులమ్మ విసుగు చెందింది. చివరకు తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో గ్రామంలోని స్థానికులను ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం ఓబులమ్మతో ఘర్షణ దిగారు. అంతేకాక ఈ గొడవలో వృద్దురాలిని గొడ్డలితో నరికి చంపారు.

అంతేకాక ఎవరికి దొర్కకుండా ఉండేందుకు ఆమె శరీర భాగాలను ముక్కలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు. ఓబులమ్మ కనిపించకపోవడంతో ఆమె బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వృద్ధురాలి బంధువుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకట శివారెడ్డి, ఇతర పోలీసులు అధికారులు పరిశీలించారు. పెనకచర్ల డ్యామ్‌ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బంగారం విషయంలో వృద్దురాలిని ముక్కలుగా చేసి చంపడం.. స్థానికంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు తరచూ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. డబ్బులు, బంగారం వంటి వాటి విషయంలో చంపడానికి కూడా వెనుకాడని మృగాలు తయారయ్యారు. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş