iDreamPost
android-app
ios-app

ప్రియుడిపై మోజు..భర్తను దారుణంగా హతమార్చిన భార్య!

నేటికాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా కొందరు ఆడవారు సైతం పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాళికట్టిన భర్తను, కన్న బిడ్డలను సైతం హతమార్చుతున్నారు. తాజాగా ఏపీలో ఓ దారుణం చోటుచేసుకుంది.

నేటికాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా కొందరు ఆడవారు సైతం పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాళికట్టిన భర్తను, కన్న బిడ్డలను సైతం హతమార్చుతున్నారు. తాజాగా ఏపీలో ఓ దారుణం చోటుచేసుకుంది.

ప్రియుడిపై మోజు..భర్తను దారుణంగా హతమార్చిన భార్య!

ఇటీవల కాలంలో జరుగుతున్న నేరాలల్లో వివాహేతర సంబంధం కారణంగా జరిగే వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. హాయిగా సాగిపోయే సంసారంలో కొందరు చేజేతులా నిప్పులు పోసుకుంటున్నారు. పరాయివారితో పది నిమిషాల పడక సుఖం కోసం పచ్చని కాపురాన్ని నిట్టనిలువును కాల్చుకుంటున్నారు. ఇక వివాహేతర సంబంధాల్లో మహిళలకు ఉంటున్నారు. ప్రియుడి మోజులో పడి ఉన్న కట్టుకున్న వాడిని, కన్న పిల్లలనే కడతేర్చుతున్నారు. తాజాగా ఓ వివాహిత ప్రియుడిపై మోజుతో భర్తను కడతేర్చిందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం  సాలాపువానిపాలెం గ్రామానికి చెందిన సాలాపు శ్రీనివాసరావు (32) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో  శ్రీవాస రావుకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడింది.

ఆ  పరిచయం కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల తరువాత ఈ విషయం ఆమె భర్త శ్రీనివాసులకు తెలిసింది. దీంతో ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలా ఈ దంపతుల మధ్య వాగ్వాదాలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించారు. ఆ తరువాత కూడా భాగ్యలక్ష్మి, శ్రీనివాసులు కలిసి అనంతరం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస రావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా… అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకున్నారు. అనంతరం అతడితో గొడవ పడటమే కాకుండా మంచం కోడుతో తలపై దాడి చేశారు. దీంతో బాధితుడు గట్టిగా పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతో పాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాసరావు గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.