iDreamPost
android-app
ios-app

దారుణం: గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల చిన్నారి మృతి

దారుణం: గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల చిన్నారి మృతి

ఈ భూమి మీద వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. తల్లి తన బిడ్డలన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ కంటికి రెప్పల కాపాడుకుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పిల్లల అల్లరి చేసినప్పుడు.. తల్లి కోపం ప్రదర్శిస్తుంటుంది. కొందరు తల్లులు అయితే పిల్లలపై భౌతిక దాడికి కూడా చేస్తుంటారు. ఇలా వారు క్షణికావేశంలో చేసే పనుల వలన బిడ్డలు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు  ఉన్నాయి. తాజాగా కోపంతో 16 నెలల చిన్నారిని ఆమె తల్లి గరిటతో కొట్టింది. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి చెందిన సాయి, గాజువాకలో నివాసం ఉండే స్నేహ 2020 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఉపాధి నిమిత్తం విజయవాడ వెళ్లి..అక్కడే నివాసం ఉంటున్నారు.  ఈ దంపతులకు 2022 మార్చి నెలలో గీతశ్రీ అనే పాప జన్మించింది. ఆ తర్వాత దంపతుల మధ్య కలహాలు రావడంతో విజయవాడ నుంచి సొంతురికి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం సాయి ఎలమంచిలిలో ఉండగా స్నేహ తన కుమార్తెను తీసుకుని గాజువాకలో ఉంటుంది. గత కొద్దికాలం నుంచి సమీప బంధువైన ఎలమంచిలికి చెందిన రమణబాబుతో స్నేహ సన్నిహితంగా ఉంటోంది. మంగళపాలెంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన కుమార్తెతో కలసి స్నేహ నివాసం ఉంటోంది.

ఈనెల 17న కుమార్తె అల్లరి చేస్తుందని గరిటెతో తలపై కొట్టడంతో చిన్నారి చనిపోయింది. దీంతో బంగారు స్నేహ, రమణబాబు సాయంతో ఇంటి వెనుక ప్రాంతంలో గొయ్యి తీసి ఖననం చేశారు. శనివారం స్నేహ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మనవరాలి గురించి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులతో పాపను విక్రయించేశానని బదులిచ్చింది. అయితే చిన్నారి మృతదేహం వీధికుక్కలు గొయ్యిలోంచి బయటకు లాగడంతో వ్యవహారం బయటపడింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విషాదం: లిఫ్ట్ గుంతలో పడి 10వ తరగతి బాలిక మృతి!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom