Krishna Kowshik
రోడ్డుపై వెళుతుంటే.. జంతువులను వాహనాలు ఢీకొట్టడం పరిపాటిగా జరుగుతుంది. కానీ జంతువే.. కారును ఢీ కొడితే ఎలా ఉంటుందో. . ఈ వార్త కథనాన్ని చదవండి.. ఇది ఎక్కడో కాదు.. ఏపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళుతుంటే.. జంతువులను వాహనాలు ఢీకొట్టడం పరిపాటిగా జరుగుతుంది. కానీ జంతువే.. కారును ఢీ కొడితే ఎలా ఉంటుందో. . ఈ వార్త కథనాన్ని చదవండి.. ఇది ఎక్కడో కాదు.. ఏపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Krishna Kowshik
సాధారణంగా రోడ్డుపై వెళుతుంటే కుక్కలు, పిల్లులు అడ్డు వస్తుంటాయి. దీంతో బైక్ స్లిప్ అయ్యి పడిపోతుంటుంది. ఆ వాహనంపై వెళ్లే వాళ్లకు దెబ్బలు తగులుతుంటాయి. అదే కారు, లారీ వంటి వాహనాలు అయితే.. వాటి కింద పడి ఈ జంతువులు చనిపోతుంటాయి. అదే పూర్తిగా అటవీ మార్గం గుండా వెళితే మాత్రం కాస్త అటు, ఇటు చూసుకోవాల్సిందే. ఎందుకుంటే..ఏనుగు, పులి, సింహం లాంటి భారీ జంతువులైతే.. మనుషుల మీదకు దూసుకొస్తుంటాయి. కానీ హైవేపై వెళుతుంటే.. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోవడమే తెలుసు. ఇటువంటి జంతువులను ఊహించడం కష్టమే. కానీ అలాంటి ఊహకందని సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కారును పెద్ద పులి ఢీ కొట్టడంతో.. వాహనం ఫ్రంట్ నుజ్జునుజ్జయ్యింది.
ఈ ఘటన శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. బద్వేలుకు చెందిన ఐదురుగు కారులో నెల్లూరుకు వెళుతున్నారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లె సమీపంలోని నెల్లూరు- ముంబయి హైవేపై వీరి వాహనం రయ్ అంటూ దూసుకెళుతుంది. అంతలో ఫారెస్ట్ఏరియాలో పెద్దపులి రోడ్డు దాటుతూ.. వీరి కారును బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా వస్తుండటంతో పులిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. కారులో ఉన్న వ్యక్తులకు గాయాలు కాలేదు కానీ పులి కాళ్లకు దెబ్బలు తగిలాయి. అంత దెబ్బ తగిలి కూడా పులి అడవిలోకి పారిపోయింది. ఊహించని ఈ సంఘటనతో కారులో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. గట్టిగా కేకలు వేశారు.
తమ కళ్ల ముందే పెద్ద పులి లేచి అడవిలోకి వెళుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే కారు డోర్లు వేసి ఉండటంతో వీరికి ప్రాణ పాయం తప్పింది. అలాగే పులి కూడా అక్కడ నుండి తప్పించుకునేందుకు అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. దెబ్బకు కారు రూపు రేఖలు మారిపోయాయి. స్థానికులు అడవీ శాఖకు సమాచారం అందించారు. గాయపడిన పులి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. పెద్దపులి సంచారం గురించి తెలియడంతో… మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.