iDreamPost
android-app
ios-app

పద్మ విభూషణ్ చిరంజీవిని కలిసిన ఏపీ BRS అధ్యక్షులు!

  • Published Feb 01, 2024 | 3:50 PM Updated Updated Feb 01, 2024 | 3:50 PM

Thota Chandrasekhar, Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు కలిసి విషెష్ చెబుతున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా మెగాస్టార్ ను కలిశారు.

Thota Chandrasekhar, Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు కలిసి విషెష్ చెబుతున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా మెగాస్టార్ ను కలిశారు.

  • Published Feb 01, 2024 | 3:50 PMUpdated Feb 01, 2024 | 3:50 PM
పద్మ విభూషణ్ చిరంజీవిని కలిసిన ఏపీ BRS అధ్యక్షులు!

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురష్కారం దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరును ఎన్నో అవార్డులు వరించగా.. తాజాగా ఆ జాబితాల్లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చి చేరింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం ఆయన్ను వరించడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోకు దక్కిన అరుదైన గౌరవంపై కాలర్ ఎగరేస్తున్నారు. ఇక చిరంజీవికి దేశ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి..విషెష్ చెప్పారు. తాజాగా ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మెగాస్టార్ ను కలిశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్.. పద్మవిభూషణ్ చిరంజీవిను కలిశారు. మెగాస్టార్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవికి విషెష్ తెలియజేశారు. పద్మ విభూషణ్ అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారణం అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ తోట చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, 99టీవీ టీమ్ అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల హృదయాల్లో అన్నయ్యగా చెరగని ముద్రవేసిన కథానాయకుడు చిరంజీవి అని ఆయన పేర్కొన్నారు. ఇక టాలీవుడ్ సుప్రీమ్, మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన చిత్రసీమలో తొలి సుప్రీమ్ హీరోగా గుర్తింపు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అందరి మనసులో గూడు కట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను అలకరించాయి. తాజాగా ఆయన కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. 2024 ఏడాదిక గాను కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదు మందికి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించారు. వీరిలో చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి  ‘విశ్వంభర’ అనే సినిమాలో నటించనున్నారు.  ఈ సినిమా కోసం చిరంజీవి బాగా కష్టపడిపోతున్నారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు.  జిమ్ లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet