iDreamPost
android-app
ios-app

అత్తను చితకబాది.. కోడల్ని ఎత్తుకెళ్లిన దుండగులు

  • Published Sep 29, 2023 | 2:56 PM Updated Updated Sep 29, 2023 | 2:56 PM
  • Published Sep 29, 2023 | 2:56 PMUpdated Sep 29, 2023 | 2:56 PM
అత్తను చితకబాది.. కోడల్ని ఎత్తుకెళ్లిన దుండగులు

వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు ఎంతటికైనా తెగిస్తాయి. దేశంలో జరుగుతున్న సగానికి పైగా దారుణాలు తెలిసిన వ్యక్తులే చేస్తుండటం గమనార్హం. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల అఘాత్యాలకు కారణమౌతున్నాయి. నిలకడ మీద నిజాలు తెలిసినట్లు.. సంఘటనలు జరిగిన తర్వాత కొన్నిరోజులకు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆ తర్వాతే ఆ ఘటనలు వెనుక తెలిసిన, పరిచయస్థుల హస్తం ఉందని నిర్ధారణ అవుతుంది. తాజాగా పల్నాడు జిల్లాలోని పట్టపగలు ఓ ఇంటిపై దాడి చేసిన దుండగులు అత్తను చితకబాది.. కోడల్ని ఎత్తుకెళ్లారు. అయితే ఇది తెలిసిన వారి పనేనని చెబుతున్నారు బాధితురాలు నాగలక్ష్మి. ఇంతకు ఏం జరిగిందంటే..?

నరసరావు పేట మండలం ఉప్పలపాడు జగనన్న కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో చొరబడ్డ ఐదుగురు ఆగంతకులు అత్త నాగలక్ష్మిని చితక బాది.. 26 ఏళ్ల వయస్సున కోడలు లక్ష్మీ ప్రణతిని ఎత్తుకెళ్లారు. దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాగలక్ష్మి నరసరావు పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శ్రీను, రమేష్, చంటి, ఇంకో ఇద్దరు వచ్చారని, తనతోపాటు తన కుమారుడు, మనవడిపై దాడి చేసి..తమ కోడల్ని ఎత్తుకెళ్లారని నాగలక్ష్మి తెలిపారు.  ఆమె ఎలా ఉందో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss