Uppula Naresh
ఏపీలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి యజమాని ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ఇటుకలతో గోడ కట్టాడు. ఆ యజమాని ఎందుకు ఇలా చేశాడంటే?
ఏపీలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి యజమాని ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ఇటుకలతో గోడ కట్టాడు. ఆ యజమాని ఎందుకు ఇలా చేశాడంటే?
Uppula Naresh
ఏపీలోని ఓ ప్రాంతంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి యజమాని ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ఇటుకలతో గోడ కట్టాడు. ఈ విషయం తెలుసుకుని చుట్టు పక్కల ఇంట్లో వాళ్లంతా ఖంగుతిన్నారు. వీరితో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంతకు ఆ ఇంటి యజమాని ఎందుకు రోడ్డు మధ్యన ఇలా గోడ కట్టాడు. అందుకు దారి తీసిన కారణాలు ఏంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామం.
ఇదే ఊరిలో కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు అనే వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీళ్ల ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. అయితే, గ్రామ అధికారులు ఇంటి మధ్య ఓ సీసీ రోడ్డును నిర్మించారు. ఇదిలా ఉంటే.. లక్ష్మీనారాయణ తన ఇంటి నిర్మాణంలో భాగంగా రోడ్డుపైకి వచ్చేలా మెట్లు కట్టాడు. ఇదే విషయంపై చంద్రశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు ఇదే విషయంపై తరుచు గొడవ పడేవారు. ప్రతీసారి వాగ్వాదానికి దిగుతుండడంతో గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టించారు. ఇంతే కాకుండా వీరి వివాదం చివరికి పోలీసుల వరకు వెళ్లింది. గ్రామ పెద్దలు, పోలీసులు ఏకమై లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ మధ్య రాజీ కుదిర్చారు.
అయినా వీరి వ్యవహారం కొలిక్కి రాలేదు. అయితే ఈ క్రమంలోనే చంద్రశేఖర్ ఇంటి ముందున్న మురికి కాలువపై మెట్లు కట్టుకున్నాడు. ఈ వివాదం మరింత ముదరడంతో వీరిద్దరు మరోసారి గొడవ పడ్డారు. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన లక్ష్మీ నారాయణ.. ఇటీవల వీరి ఇంటి ముందున్న సీసీ రోడ్డు మధ్యలో గోడ కట్టాడు. ఈ సీన్ చూసి చంద్రశేఖర్ షాక్ కు గురయ్యాడు. ఇదే విషయంపై గ్రామ పెద్దల వరకు తీసుకెళ్లాడు. ఇక అతడు చేసిన పనికి గ్రామస్తులు కూడా ఇదేం పనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇద్దరు గొడవపడి జనాలు వెళ్లే రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా ఇలా గోడ కట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామ పెద్దలు మరోసారి స్పందించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ప్రయత్నం చేస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పుడు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. విభేదాల కారణంగా ఇలా నడి రోడ్డుపై గోడ కట్టిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.