iDreamPost
android-app
ios-app

కర్కశ భర్త.. భార్యకు గుండు కొట్టించి.. వీధిలో తిప్పి

  • Published Feb 03, 2024 | 2:00 PM Updated Updated Feb 03, 2024 | 2:00 PM

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అది నమ్మిన మహిళ.. అడిగినంత డబ్బులు ఇచ్చింది. మాట ప్రకారమే.. అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత..

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అది నమ్మిన మహిళ.. అడిగినంత డబ్బులు ఇచ్చింది. మాట ప్రకారమే.. అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత..

  • Published Feb 03, 2024 | 2:00 PMUpdated Feb 03, 2024 | 2:00 PM
కర్కశ భర్త.. భార్యకు గుండు కొట్టించి.. వీధిలో తిప్పి

వారిద్దరూ జూనియర్ ఆర్టిస్టులు. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రియుడి తియ్యటి మాటలకు పడిపోయింది. పెళ్లి చేసుకుంటానని హామీనివ్వడంతో ఆమె సంపాదించిన, దాచుకున్న డబ్బులన్నీ అతడి చేతిలో పోసింది. అనంతరం వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కింది. వారి ప్రేమకు గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత భర్త నిజ స్వరూపం బయటకు వచ్చింది. పెళ్లైన తర్వాత ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. తట్టుకోలేక పోలీసు కేసు కూడా పెట్టింది. అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు సరికదా.. ఆమెకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో విసిగి .. అతడిని విడిచి పెట్టి .. దూరంగా ఉంటుంది.

అయితే ఇటీవల భర్త రెండవ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. అత్తింటికి చేరుకోవడంతో ఆమెకు గుండె గీయించి.. వీధుల్లో తిప్పడమే కాకుండా.. ‘నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడి గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెదకొండేపూడికి చెందిన కర్రి రాంబాబు అలియాస్ అభిరామ్.. గతంలో హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసేవాడు. ఆ సమయంలో మరో జూనియర్ ఆర్టిస్టు.. నెల్లూరుకు చెందిన షేక్ ఆషాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కొడుకు పుట్టాక.. ముఖం చాటేశాడు అభిరామ్. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆషా దగ్గరకు అభిరామ్ తల్లిదండ్రులు వెళ్లి.. ఈకేసు ఉపసంహరించుకోవాలని.. హైదరాబాద్ నుండి తమ ఇంటికి రావాలని కోరడంతో అలాగే చేసింది ఆశా.

అక్కడకు వెళ్లాక.. పోలవరం ప్రాజెక్టులో ఓ అధికారి వద్ద కారు డ్రైవర్‌గా చేరాడు అభిరామ్. కొన్నాళ్ల పాటు సజావుగా కాపురం సాగిపోగా.. మళ్లీ తనలోని పాత రాంబాబును బయటకు తీశాడు. ఆమెను భర్త, అత్తమామలు కూడా చిత్ర హింసలకు గురి చేసి.. ఇంటి నుండి గెంటేయడంతో.. వరకట్న వేధింపులు కేసు పెట్టింది ఆషా. అనంతరం ఆషా హైదరాబాద్ వెళ్లిపోయి.. అక్కడ పని చేసుకుంటుంది. అంతలో భర్తకు రెండవ పెళ్లి చేస్తున్నారని తెలిసి.. సీతానగరం వెళ్లి న్యాయ పోరాటానికి దిగింది. అయితే శుక్రవారం ఉదయం భార్యను గదిలో బంధించి.. ట్రిమ్మర్ ‌తో శిరోముండనం చేశాడు. వేరు చేసిన జుట్టును ఓ చేత్తో, ఆమెను మరో చేత్తోనూ పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ వీధిలో తిప్పాడు. ఎవరేం చేస్తారో చూస్తానంటూ అక్కడ ఉన్నవారిని బెదిరించి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు..ఆషాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet