iDreamPost
android-app
ios-app

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తున్న మనిషి మరో నిమిషంలో కనిపించడం లేదు. ఇందుకు కారణమౌతుంది గుండె పోటు.. తాజాగా

చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తున్న మనిషి మరో నిమిషంలో కనిపించడం లేదు. ఇందుకు కారణమౌతుంది గుండె పోటు.. తాజాగా

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

పిడికెడంత గుండె ఎంత పని చేస్తోంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ తన పని తాను చేసుకోవాల్సిన హార్ట్ .. తత్తరపాటుకు గురి అవుతూ.. ఉన్నపళంగా ఆగిపోతుంది. చిన్న, పెద్ద అనే వ్యత్యాసం లేదు.. ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా బలి తీసుకుంటుంది కనికరం లేని గుండె. ఇప్పుడు చూస్తున్న వ్యక్తులు.. మరు క్షణంలో విగతజీవిగా మారుతున్నారు. దీనికి కారణమౌతోంది హార్ట్ ఎటాక్. ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా అనేక మంది మరణించారు. పసి బిడ్డ నుండి కాటికి కాలు చాపే ముసలోళ్ల వరకు దీనికి బాధితులౌతున్నారు. ప్రమాదాల కన్నా ఘోరంగా హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమ్మాయిని గుండె పోటు బలి తీసుకుంది. పల్నాడు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. నాగవారానికి చెందిన అమ్మాయి గుండె పోటుతో మరణించింది. స్థానిక హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఆ బాలిక.. ఇటీవల మొదలైన టెన్త్ పరీక్షలు రాస్తుంది. ఆమెకు బృగుబండలో పరీక్షా కేంద్రం పడగా.. అక్కడకు వెళ్లి ఎగ్జామ్స్ రాస్తోంది. బుధవారం కూడా పరీక్షకు హాజరై ఇంటికి చేరింది. అంతో ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను సత్తెన పల్లి తీసుకెళుతుండగా.. మార్గ మధ్యంలోనే చనిపోయింది. కాగా, ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటుతో చనిపోయిట్లు నిర్ధారించారు. విద్యార్థిని కొన్నాళ్లుగా గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతుందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.

పదో తరగతి పరీక్షలు రాసి ఆపై ఉన్నత చదువులు చదువుకోవాల్సిన కూతురు.. విగత జీవిగా మారే సరికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే ఈ మరణాలు కరోనా తర్వాత ఎక్కువయ్యాయి. ఒళ్లు అలిసేలా వ్యాయామాలు చేసినా.. ఎగిరినా, గంతులేసినా, తీవ్రమైన ఒత్తిడికి గురౌతున్నా గుండె పోటు  బలితీసుకుంటుంది. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం హార్ట్  ఎటాక్ కారణంగా చనిపోతున్న సంగతి విదితమే.  ఈ నేపథ్యంలో కేంద్రం కూడా పలు హెచ్చరికలు చేసింది. కొన్నాళ్ల పాటు ఒత్తిడి, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని పేర్కొంది. ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా చూసుకుంటే గుండె పోటు నుంచి తమను తాము రక్షించుకోవచ్చని సూచించింది.