SNP
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గీతాంజలి ఆత్మహత్యపై ఆమె చిన్నారి కూతురు స్పందించింది. ఆమె మాటలు కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి. తల్లి చనిపోయిన రోజు గురించి ఆ చిన్నారి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గీతాంజలి ఆత్మహత్యపై ఆమె చిన్నారి కూతురు స్పందించింది. ఆమె మాటలు కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి. తల్లి చనిపోయిన రోజు గురించి ఆ చిన్నారి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..
SNP
తెనాలికి చెందిన పేదింటి ఆడబిడ్డ గీతాంజలి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచితంగా ఇంటిని, ఇంటి పట్టాను ఇచ్చిందనే సంతోషాన్ని ఆమె మీడియా ముఖంగా వెల్లడించింది. అదే ఆమె చేసిన పాపమైపోయింది. ఆ వీడియోను పట్టుకుని ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు కొంతమంది ఆమెను మానసికంగా వేధించాయి. ఈ సోషల్ మీడియా పిశాచాలు చేపిన అసభ్యకరమైన ట్రోలింగ్‌కి ఆమె ఆత్మగౌరవం దెబ్బతింది. తనపై జరుగుతున్న దాడిని భరించలేక.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేస్తూ.. ఆమె ఆత్మహత్య చేసుకుంది.
అయితే.. తాజాగా గీతాంజలి మరణంపై ఆమె కూతురు మాట్లాడింది. ఆ చిన్నారి మాటలు కంట తడి పెట్టించేలా ఉన్నాయి. ఆ తల్లి మరణించిన సమయంలో ఇద్దరు చిన్నారులు స్కూల్‌లో ఉన్నారు. ఆ విషయాన్నే ఆ చిన్నారి చెప్పింది. ‘ఏం జరిగిందో మాకు అర్థం కాట్లేదు. ఆ రోజు మేం స్కూల్‌కు వెళ్లాం. రెండు, మూడు రోజుల నుంచి అమ్మ సరిగా మాట్లాడటం లేదు. అమ్మా.. అమ్మా.. అని పిలిచినా మాట్లాడట్లేదు’ అని ఆ చిన్నారి వెల్లడించింది. అమ్మ ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయిందనే విషయాలు తెలియని ఆ చిన్నారుల మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారు అనాథలు అవ్వడానికి కారణం ఎవరంటూ కొంతమంది సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం పొందిన ఓ పేదింటి మహిళ తన సంతోషాన్ని వ్యక్తపర్చడం కూడా భరించలేకపోతున్నారు కొంతమంది దుర్మార్గులు అంటూ మండిపడుతున్నారు. ఇద్దరు చిన్నారులతో కలిసి.. భర్త సంపాదనతో ఇళ్లు గడవం కష్టమని భావించి, సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు ఇంటిపనులతో పాటు బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తూ.. సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా లాక్కొస్తున్న ఆ మహిళపై ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా విషసర్ఫం కాటువేసింది. వారి పైశాచికత్వానికి ఫలితం ఏంటంటే.. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లి లేని పిల్లలయ్యారు. ఈ మొత్తం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బలైన గీతాంజలి గురించి మీడియాతో మాట్లాడిన ఆమె భర్త, పిల్లలు.
Video credits – TV9 pic.twitter.com/nIpcwyn5sN
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2024