Telugu States Weather Report:తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు మండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మే మొదటి రెండు వారాల్లో ఎండలు మండిపోయినా.. చివరి వారంలో వాతావరణం చల్లబడింది.

Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు మండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మే మొదటి రెండు వారాల్లో ఎండలు మండిపోయినా.. చివరి వారంలో వాతావరణం చల్లబడింది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాలు, ఉత్తర ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితలం ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతీ దిశగా కొనసాగుతుందని తెలిపింది. ఉపరిత ఆవర్తనం, అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అంతేకాదు నేడు (జులై1) పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో నైరుతి రుతుపవణాలు చురుగ్గా ఉన్నాయని.. దీని ప్రభావం  భద్రాద్రి కొత్తగూడెం,  ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, మేడ్చెల్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. నెల్లూరు, కావలి, బాపట్ల, ఒంగోలు, మచిలీపట్నం, గన్నవరం, అమలాపురం, భీమవరం, కాకినాడ, అన్నవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎల్ల అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని.. అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలని సూచించించింది.

Show comments