iDreamPost
android-app
ios-app

ఇంత నిర్లక్ష్యమా..విద్యార్థిని జీవితంతో టీచర్స్ ఆటలు.. 96 వస్తే..36 వేశారు..!

  • Published May 30, 2024 | 8:21 AM Updated Updated May 30, 2024 | 8:21 AM

Annamayya District: ఇటీవల కొంతమంది టీచర్లు చేసే నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. తాము ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. ఫలితాలు వచ్చిన తర్వాత ఫెయిల్ కావడం.. మార్కులు తక్కువ రావడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

Annamayya District: ఇటీవల కొంతమంది టీచర్లు చేసే నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. తాము ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. ఫలితాలు వచ్చిన తర్వాత ఫెయిల్ కావడం.. మార్కులు తక్కువ రావడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

ఇంత నిర్లక్ష్యమా..విద్యార్థిని జీవితంతో టీచర్స్ ఆటలు.. 96 వస్తే..36 వేశారు..!

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే గురువులకు సమాజంలో ఎంతో ఉన్నత స్థానం కల్పించబడింది. అందుకే గురువులను త్రిమూర్తులతో పోల్చుతారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చినా.. వారికి ఉన్నతవిద్యనందించే విషయంలో గురువుల పాత్ర కీలకం. కానీ ఈ మధ్య కొంతమంది టీచర్ల వల్ల గురువు స్థానానికి కలంకం వస్తుంది. మద్యం సేవించి పాఠశాలకు రావడం, విద్యార్థులను చితకబాదడం, అసభ్యంగా ప్రవర్తించడం ఇలా ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది న్విజిలేటర్లు చేస్తున్న తప్పుల వల్ల మార్కుల్లో తేడాలు వచ్చి మానసికంగా కృంగిపోతున్నారు. అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రతి విద్యార్థికి పదవ తరగతి అనేది ఎంతో ముఖ్యమైనది.. ఇక్కడి నుంచే ఉన్నత విద్యకు పునాదులు వేస్తుంటారు.  ప్రతి విద్యార్థి టెన్త్ లో మంచి మార్కులు సాధించాలనే పట్టుదలతో ఉంటారు.  మంచి ర్యాంక్ కోసం  విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కష్టపడుతుంటారు. తాజాగా మండలంలో టాప్ ర్యాంకర్ అయిన విద్యార్థినికి అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ స్థానం దక్కకుండా పోయింది. ప్రతి సబ్జెక్ట్ లో ఆ విద్యార్థినికి 98,97 మార్కులు వచ్చాయి.. కానీ సోషల్ సబ్జెక్ట్ లో కేవలం 36 మార్కులు రావడంతో ర్యాంక్ రాకుండా పోయింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికి గురైంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా బోడిమల్లవారిపల్లె తోసిఫా అనే విద్యార్థిని ఇటీవల టెన్త్ ఎగ్జామ్ రాసింది.

ఏప్రిల్ లో వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో తోసిఫాకు అన్ని సబ్జెక్ట్ ల్లో 98,97 మార్కులు వచ్చాయి. కానీ సోషల్ లో మాత్రం కేవలం 36 మార్కులు రావడంతో తోసిఫా షాక్ కి గురైంది. మొదటి నుంచి టాప్ ర్యాంకర్ గా ఉన్న తోసిఫాకు అంత తక్కువ మార్కులు రావడం ఏంటీని తల్లిదండ్రుల, ప్రిన్సిపాల్ కూడా ఆశ్చర్యపోయారు. తోసిఫాకు ధైర్యం చెప్పి రివాల్యుయేషన్ కోసం విద్యాశాఖ బోర్డుకు దరఖాస్తు చేశారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో తాసిఫాకు సోషల్ సబ్జెక్ట్ లో 100 కు 96 మార్కులు వచ్చాయి. 584/600 మార్కులతో మండలంలో తాసీఫా టాపర్ గా నిలిచింది. పరీక్షలు మూల్యాంకనం చేసిన టీచర్ తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని.. ఇలాంటి తప్పిదాలు చేసి ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విద్యాశాఖాధికారులను కోరారు.