P Krishna
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ సీఎ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు పలు కేసుల్లో చంద్రబాబు బెయిల్ కోసం విఫల యత్నాలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు కేసు విషయంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి చంద్రబాబు పై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని.. సాక్ష్యాధారాలు ఉండబట్టే ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు. విచారణకు టీడీపీ ఎందుకు భయపడుతుంది.. ఏ నేరం చేయని వారైతే నిర్ధోషులుగా బయటకు వస్తారు కదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టు పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తెగ ఆందోళనలు చేపడుతున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కోర్టులో నిర్ణయిస్తే ఆయన నిర్ధోషిగా బయటకు వస్తారని.. ఒకవేళ ఈ కేసులో దోషిగా తేలితే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా మారుతారని, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నిన్న గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ఆయన భార్య భువనేశ్వరి, ఢిల్లీలో ఆయన తనయుడు నారా లోకేశ్ సహ పలువురు నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
The matter is in the court, the evidence is presented, and the accused has been arrested. Why is the TDP scared of a trial? Let #ChandrababuNaidu have his day in court, if the courts decide, he may walk free, but if convicted he shall be disqualified as an MLA and debarred from…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2023