iDreamPost
android-app
ios-app

టీడీపీ MLA బాలకృష్ణకు హిందూపురంలో చేదు అనుభవం..‍ వీడియో వైరల్‌

  • Published Nov 16, 2023 | 11:18 AM Updated Updated Nov 16, 2023 | 11:18 AM

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన రాకను స్థానికులు అడ్డుకున్నారు. ఆ వివరాలు..

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన రాకను స్థానికులు అడ్డుకున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 16, 2023 | 11:18 AMUpdated Nov 16, 2023 | 11:18 AM
టీడీపీ MLA బాలకృష్ణకు హిందూపురంలో చేదు అనుభవం..‍ వీడియో వైరల్‌

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన రాకను స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. అభివృద్ధి పనులు చేయలేదు.. కేవలం స్థానికంగా జరిగే శుభకార్యాలు, పండగలు, పెళ్లిళ్లకు మాత్రమే వస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదంటూ.. జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణను.. ప్రజలు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. ఈ సంఘనటతో ఎమ్మెల్యే అవక్కాయ్యారు. వెంటనే వెనుదిరిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

దాదాపు పది నెలల తర్వాత బాలయ్య.. హిందూపురంలో పర్యటించారు. హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు బాలకృష్ణ హాజరయ్యారు. అయితే కొద్దీ నెలలుగా నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై ఆగ్రహంతో ఉన్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని అసంతృప్తితో ఉన్నారు. కేవలం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యను అడ్డుకున్నారు.

వరుసగా రెండు సార్లు.. హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు బాలకృష్ణ. కానీ ఏనాడు నియోజకవర్గంలో పర్యటించలేదు.. అభివృద్ధి పనుల గురించి పట్టించుకోలేదని ఎప్పటి నుంచో జనాల్లో అసంతృప్తి నెలకొని ఉంది. పైగా అసెంబ్లీలో.. ఒక్క రోజు కూడా నియోజకవర్గం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రజల గురించి ఏనాడు అసెంబ్లీలో నోరు తెరవని బాలయ్య.. తన బావ చంద్రబాబు అరెస్ట్‌ మీద మాత్రం వీరంగా సృష్టించారు.

అసెంబ్లీ అనే విషయం మర్చిపోయి.. ఈలలు వేస్తూ.. తొడకొడుతూ.. నానా రభసా చేసి.. టీడీపీ పరువు తీశారు. తన కుటుంబ సభ్యల కోసం ఇంతలా రచ్చ చేసిన బాలయ్య.. తనకు ఓటు గెలిపించిన ప్రజల కోసం మాత్రం ఏనాడు మాట్లాడలేదు.. వారి సమస్యలు పట్టించుకోలేదు. దాంతో బాలకృష్ణ మీద ఆగ్రహంగా ఉన్న ప్రజలు.. ఆయన రాకను అడ్డుకుని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

marsbahis girişjojobetjojobet giriş