SNP
Taneti Vanitha, Nallajerla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై మంగళవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ దాడిలో ప్రచారం వాహనంతో పాటు మరికొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ దాడి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Taneti Vanitha, Nallajerla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై మంగళవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ దాడిలో ప్రచారం వాహనంతో పాటు మరికొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ దాడి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనితపై దాడి జరిగింది. ఏకంగా రాష్ట్ర మంత్రిపై దాడికి కొంతమంది యత్నించడంతో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తూర్పు గోదావారి జిల్లాలోని గోపాలపురం నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకుని.. స్థానికంగా ఉన్న మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలతో గొడవకు దిగారు. అక్కడే ఉన్న వైసీపీ ప్రచార వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత హోం మంత్రి తానేటి వనితపైకి దూసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు.
అయినా కూడా ప్రతిపక్ష కార్యకర్తలు ఆగకుండా.. సుబ్రహ్మణ్యం ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇంటి బయట ఉన్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. దాడికి వచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించే హోం మంత్రిపైనే ఇలా దాడికి పాల్పడ్డాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. దాడి విషయం తెలుసుకున్న ఎస్పీ హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల రాకతో నల్లజర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా.. నల్లజర్లలో భారీగా పోలీసులను మోహరించారు.
కాగా, ఈ దాడి ఘటనపై స్పందించిన హోం మంత్రి తానేటి వనిత టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలా దాడులకు దిగుతోందని ఆరోపించారు. తానొక మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం హోం మంత్రిపైనే దాడి అంటే.. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి.. ఓర్వలేక ఇలా దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మరి ఈ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.