iDreamPost
android-app
ios-app

AP Elections 2024: వైసీపీ నేత అంబటి రాంబాబు అల్లుడిపై దాడి! పోలింగ్‌ తీరును పరిశీలిస్తుండగా..

  • Published May 13, 2024 | 3:29 PM Updated Updated May 13, 2024 | 3:29 PM

Ambati Rambabu, AP Elections 2024: ఏపీ అంసెబ్లీ ఎన్నికల వేళ టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అంబటి రాంబాబు అల్లుడిపై దాడికి తెగబడ్డారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Ambati Rambabu, AP Elections 2024: ఏపీ అంసెబ్లీ ఎన్నికల వేళ టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అంబటి రాంబాబు అల్లుడిపై దాడికి తెగబడ్డారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 13, 2024 | 3:29 PMUpdated May 13, 2024 | 3:29 PM
AP Elections 2024: వైసీపీ నేత అంబటి రాంబాబు అల్లుడిపై దాడి! పోలింగ్‌ తీరును పరిశీలిస్తుండగా..

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ జోరుగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే పనిలో ఉన్నారు. అయితే.. చాలా చోట్ల పోలింగ్‌ ప్రశాంత్‌గా జరుగుతున్నా.. కొన్ని చోట్లు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, సత్తెనపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న అంబటి రాంబాబు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తూ బిజీగా ఉన్నారు. అయితే.. ఆయన అల్లుడిపై దాడి జరిగింది.

పల్నాడు జిల్లాలో రాంబాబు అల్లుడి కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్‌ తీరును పరిశీలించేందుకు వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారుపై కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్‌ అయ్యారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారంటూ మండిపడ్డారు.

చీఫ్ పోలింగ్ ఏజెంట్ అయిన నా అల్లుడిపై దాడికి ప్రయత్నించారు, ఇది ముమ్మాటికి టీడీపీ ఓర్వలేని తనం, దౌర్జన్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్నెపాడు గ్రామంలో పోలింగ్‌ ఉన్నత అధికారులు విచారణ జరిపి రీ-పోలింగ్ నిర్వహించాలి అని కోరారు. ఓడిపోతామని నిరాశ, భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. దాడి ఘటనపై ఎన్నికల అధికారులకు తెలియజేశామని, పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.