iDreamPost
android-app
ios-app

చంద్రబాబు సభలో సీఎం జగన్‌ని ఆకాశానికి ఎత్తిన TDP నేత!

  • Published Jan 30, 2024 | 1:07 PM Updated Updated Jan 30, 2024 | 1:07 PM

Alapati Rajendra Prasad: టీడీపీ అధినేత చంద్రబాబు 'రా..కదలి రా' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ సభను టీడీపీ నిర్వహించింది. అయితే సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Alapati Rajendra Prasad: టీడీపీ అధినేత చంద్రబాబు 'రా..కదలి రా' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ సభను టీడీపీ నిర్వహించింది. అయితే సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • Published Jan 30, 2024 | 1:07 PMUpdated Jan 30, 2024 | 1:07 PM
చంద్రబాబు సభలో సీఎం జగన్‌ని ఆకాశానికి ఎత్తిన TDP నేత!

రాజకీయల్లో ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అలానే తమ పార్టీ అధినేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. ఇక ఎన్నికల ప్రచార సభల్లో అయితే నేతల మాటలకు హద్దు ఉండదు. కొందరు నేతలు హద్దులు దాటి.. తాము వేదికపై ఉన్నాము అని మర్చిపోయి మాట్లాడుతుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తమ అధినేత ముందు మరో పార్టీ  అధ్యక్షుడిని పొగిడితే.. సభకు వచ్చిన వాళ్లు షాక్ కావడం ఖాయం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తాజాగా ఏపీలోనూ అలాంటి ఘటన చంద్రబాబు సభలో జరిగింది.  చంద్రబాబు బహిరంగ సభలో జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పొగడ్తలకు తెలుగు తమ్ముళ్లు అవాక్యయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారానికి సిద్ధమయ్యాయి. అధికార పార్టీ ‘సిద్ధం’ అంటూ ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేపింది. ఇదే సమయంలో టీడీపీ సైతం రా..కదలి రా.. అంటూ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ  ఈ సభలను నిర్వహించింది. సోమవారం రాజమండ్రి, పొన్నూరుల్లో నిర్వహించిన ఈ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో టీడీపీ నాయకులు అందరూ అధికార వైసీపీ, ఆ పార్టీ  అధినేత సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజా అయితే సీఎం వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సభలో ఊగిపోయిన ఆలపాటి రాజా.. చంద్రబాబు వస్తేనే విజన్‌తో ఆలోచిస్తారన్నారు.  ఇదే సమయంలో అనుకోకుండా సీఎం జగన్ ఆకాశానికి ఎత్తేశాడు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగిన సత్తా, సమర్థత ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆలపాటి రాజా నోరు జారారు. అయితే జగన్ అనుకూల వర్గం.. ఆలపాటి రాజా చేసిన పొగడ్తల వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.

ఇక ఆలపాటి రాజా విషయానికి వస్తే.. ప్రస్తుతం తెనాలి నియోజవర్గ టీడీపీ  ఇన్ ఛార్జీ గా ఉన్నారు. 2019 వైఎస్సార్ సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో మరోసారి తెనాలి నుంచి ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నారు. మరోవైపు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం కూడా ఇదే.  దీంతో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా.. తెనాలిని మనోహర్ కి కేటాయించాల్సి వస్తోందని టాక్. అయితే ఆలపాటి మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు.  ఆలపాటి రాజా.. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ తానే పోటీలో ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తెనాలి సీటును ఎవరికి కేటాయిస్తారు అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సీఎం జగన్ పై ఆలపాటి రాజా చేసిన పొగడ్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom