Dharani
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని తన తీరు మార్చుకోవడం లేదు. రౌడీలా ప్రవర్తిస్తూ.. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ గొర్రెల కాపరి మీద దాడి చేసి.. గొర్రెను ఎత్తుకెళ్లిపోయారు. ఆ వివరాలు..
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని తన తీరు మార్చుకోవడం లేదు. రౌడీలా ప్రవర్తిస్తూ.. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ గొర్రెల కాపరి మీద దాడి చేసి.. గొర్రెను ఎత్తుకెళ్లిపోయారు. ఆ వివరాలు..
Dharani
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రవర్తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. అతడు మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. రౌడీలా ప్రవర్తిస్తూ.. సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో ఏకంగా ప్రభుత్వ అధికారిపై దాడి చేసి వార్తల్లో నిలిచారు. మహిళ అని కూడా చూడకుండా.. ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేశారు. నియోజకవర్గ ప్రజలతో కూడా అలానే ప్రవర్తిస్తారు. ఇక తాజాగా మరోసారి తన ప్రవర్తనతో జనాలను భయపెట్టారు చింతమనేని. ఓ గొర్రెల కాపరిపై దాడి చేయడమే కాక.. ఏకంగా ఓ గొర్రెను కూడా ఎత్తుకుపోయారు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం, రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. లక్ష్మీనారాయణ గౌడ్ అనే గొర్రెల కాపరిపై దాడి చేశారు చింతమనేని. కారణం అతడి గొర్రెలు చింతమనేని జీడి మొక్కల వద్దకు వెళ్లాయంట. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణను బూతులు తిడుతూ.. రెచ్చిపోయారు చింతమనేని. అతడిని కింద పడేసి దాడి తన్నారని సమాచారం. అంతటితో ఆగక.. లక్ష్మీనారాయణకు చెందిన ఓ గొర్రెను తీసుకుని.. కారులో వేసుకుని వెళ్లిపోయారు చింతమనేని.
అయితే పక్కనే ఉన్న స్థానికులు చింతమనేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక.. లక్ష్మీనారాయణ గౌడ్‌కు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ చేస్తూ.. చింతమనేని కారును అడ్డుకున్నారు. దాంతో బాధితులపై తిరిగి దురుసుగా ప్రవర్తించాడు చింతమనేని.
చింతమనేని తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జనజీవన స్రవంతిలో ఉండటానికి అనర్హుడు అంటూ మండి పడుతున్నారు. టీడీపీలోని బీసీలు చింతమనేని తీరును ఖండించాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలను చులకనగా చూడటం సరికాదని.. చింతమనేని తీరు ఇలానే కొనసాగితే.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు స్థానికులు.
చింతమనేని ఓ 420.. అతడిపై రౌడీషీట్లు ఉన్నాయి. ఆనపై టీడీపీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలు కావాలో.. చింతమనేని కావాలో తేల్చుకోవాలని అల్టీమేటం జారీ చేశారు. బీసీలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారనే.. వారిని అణగదొక్కాలని టీడీపీ నేతలు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.