iDreamPost
android-app
ios-app

Undavalli Sridevi: చంద్రబాబు వెన్నుపోటు.. సంచలన కామెంట్స్ చేసిన శ్రీదేవి!

ఉండవల్లి శ్రీదేవి.. ఈ పేరు పరిచయం అక్కర్లేదు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి.. వివిధ కారణాలతో టీడీపీలో చేరారు. తాజాగా టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఆమెకు షాక్ తగిలింది.

ఉండవల్లి శ్రీదేవి.. ఈ పేరు పరిచయం అక్కర్లేదు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి.. వివిధ కారణాలతో టీడీపీలో చేరారు. తాజాగా టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఆమెకు షాక్ తగిలింది.

Undavalli Sridevi: చంద్రబాబు వెన్నుపోటు.. సంచలన కామెంట్స్ చేసిన శ్రీదేవి!

ఏపీ రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో శుక్రవారం టీడీపీ విడుదల చేసిన అభ్యర్ధుల మూడో జాబితాతో  అసంతృప్తు జ్వాలలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ మూడో జాబితాలో కొందరు సీనియర్ నేతల పేర్లు లేవు. అలానే చంద్రబాబు మాటలు నమ్మి..టీడీపీలో చేరిన  తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి గట్టి షాక్ తగిలింది. టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఆమెకు నిరుత్సాహమే మిగిలింది. దీంతో తీవ్ర వేదన చెందిన ఆమె.. చంద్రబాబును ఉద్దేశిస్తూ పరోక్షంగా ఘాట్ ట్వీట్ చేశారు.

మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అయితే ఈ అనుభవం నమ్మించి మోసం చేయడం, ఎవరిని ఎలా వాడుకునే విషయంలో ఉందని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ఎవరిని ఎప్పుడు వాడుకోవాలి, ఏ సమయంలో ఎలా వదిలించుకోవాల్లో బాబుకు తెలిసినంతగా మరెవరికి తెలియదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమందికి వెన్నుపోటు పొడిచారని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ఆ మాటలు నిజం చేసేలా చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయి.

తాజాగా ఉండవల్లి శ్రీదేవి కూడా చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. టీడీపీ మూడో జాబితాలో ఆమె పేరు లేదు. ఉండవల్లి శ్రీదేవి బాపట్ల లోక్ సభపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే చంద్రబాబు ఆ స్థానంలో వేరే అభ్యర్థిని ప్రకటించారు. దీంతో శ్రీదేవి తీవ్ర మనస్థాపానికి గురై.. రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చివర్లో కత్తిని కూడా యాడ్ చేశారు. వెన్నుపోటుకు సింబాలిక్ గా కత్తి గుర్తును పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇదే ట్వీట్ లో బాపట్ల పార్లమెంట్ మ్యాప్ ను కూడా ఆమె పోస్టు చేశారు.

ఉండవల్లి శ్రీదేవి రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వివిధ కారణాలతో పాటు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఆమె ఓటు వేశార‌నే కార‌ణంతో వైసీపీ ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో ఆమె చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి వెళ్లారు. నాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌బ్బం గ‌డుపుకునేందుకు శ్రీ‌దేవికి చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారని టాక్. తాడికొండ‌, తిరువూరు అసెంబ్లీ రిజ‌ర్వ్‌డ్ స్థానాల్లో లేదా, బాప‌ట్ల పార్లమెంట్ స్థానం నుంచి అవ‌కాశం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద ఆమె ప్ర‌తిపాద‌న పెట్టారని తెలుస్తోంది. దానికి చంద్రబాబు కూడా అంగీకరించడంతో.. సీఎం జగన్ పై ఓ రేంజ్ లో వ్యాఖ్యలు చేశారు శ్రీదేవి. టికెట్ ఇస్తాన‌ని చివ‌రి వ‌ర‌కు న‌మ్మించి, ఇప్పుడు చేతులెత్తేశారు. దీంతో చంద్ర‌బాబు త‌న‌ను న‌మ్మించి వెన్నుపోటు పొడిచార‌ని శ్రీ‌దేవి ఆవేద‌న చెందుతున్నారట.

రాజ‌కీయాలు ఎలా వుంటాయో, ఎవ‌రు ఎలాంటి వారో అర్థ‌మైంద‌నే కామెంట్స్ చంద్ర‌బాబును ఉద్దేశించి చేసిన‌వేని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బాబు కంటే సీఎం జ‌గ‌నే మేల‌ని  శ్రీదేవి చేసిన ట్వీట్ చెప్ప‌క‌నే చెబుతుందని టాక్. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంలో త‌నకు అవ‌స‌రం ఉన్న‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ మాయ మాట‌లు చెప్ప‌లేద‌ని,  చంద్ర‌బాబు మాత్రం న‌మ్మించి, అవ‌స‌రం తీరిన త‌ర్వాత వెన్నుపోటు పొడిచార‌నే అర్థం వ‌చ్చేలా శ్రీ‌దేవి ఈ పోస్టు పెట్టార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తంగా చంద్రబాబు వెన్నుపోటు జాబితాలో శ్రీదేవి కూడా చేరారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.