Krishna Kowshik
ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు ఆ విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన తరగతులకు పరీక్షలు జరుగుతున్నాయి. మాకెప్పుడు సమ్మర్ హాలీడేస్ అని ఎదురు చూస్తున్నారా..?
ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు ఆ విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన తరగతులకు పరీక్షలు జరుగుతున్నాయి. మాకెప్పుడు సమ్మర్ హాలీడేస్ అని ఎదురు చూస్తున్నారా..?
Krishna Kowshik
ఇప్పుడు పరీక్షాల సమయం. ఎగ్జామ్స్ ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ కోసం ఎదురు చూస్తుంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే పుస్తకాలకు గుడ్ బై చెప్పి అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి వాలిపోయేందుకు సిద్ధమౌతుంటారు. ఆట పాటల్లో మునిగి తేలిపోయేందుకు సంవత్సరం అంతా ఈ సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. అమ్మ, నాన్నలతో ఎక్కువ సమయం గడిపేందుకు కూడా ఊవిళ్లూరుతుంటారు. ఎండాకాలం సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కదా.. అలాంటి వారికి శుభవార్త. వేసవి సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఈ సారి దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో భారీగా సెలవులు ఇచ్చింది.
గత ఏడాది కన్నా ఈ ఏడాది దాదాపు 50 రోజులకు పైగా విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయొచ్చు. 2023-24 విద్యా సంవత్సరం ఈ ఏప్రిల్‌తో ముగియనుంది. ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిసిపోయాయి. ఇప్పుడు ప్రైమరీ, సెకండరీలోని 8,9 తరగతి వరకు పరీక్షలు జరగుతున్నాయి. కొన్ని స్కూళ్లకు పరీక్షలు ముగిసి.. తదుపరి ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులను స్టార్ చేసేశారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని పాఠశాలలకు సెలవులు డిక్లేర్ చేసింది జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్. ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు ఎండాకాలం సెలవులుగా ప్రకటించింది. అంటే సుమారు 51 రోజులు సెలవులు ఇచ్చింది.
సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రకటన .. అలాగే ఎండలు కూడా ఈ ఏడాది ఎక్కువగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇన్ని సెలవులను మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఒంటి పూట బడులు జరుగుతున్నాయి. మార్చి 18 నుండి హాఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయి. అలాగే పది మినహాయించి.. మిగిలిన తరగతులకు పరీక్షలు నిర్వహించి.. ఏప్రిల్ 15-16 నాటికి ముగించి.. ఫలితాలు 19-20 నాటికి ప్రకటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుండి అన్ని ప్రైవేట్, పబ్లిక్ స్కూళ్లకు ఈ సెలవులు వర్తించనున్నాయి. నిబంధనలు అతిక్రమించి పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ప్రకటించింది.