Arjun Suravaram
YS Jagan: కుమారి ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక ఆమె సంపాదన గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు వచ్చే సంపాదనపై క్లారిటీ ఇస్తూ సీఎం జగన్ నుంచి పొందిన సాయం గురించి చెప్పుకొచ్చారు.
YS Jagan: కుమారి ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక ఆమె సంపాదన గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు వచ్చే సంపాదనపై క్లారిటీ ఇస్తూ సీఎం జగన్ నుంచి పొందిన సాయం గురించి చెప్పుకొచ్చారు.
Arjun Suravaram
సోషల్ మీడియాలో ద్వారా ఎంతో ఫేమస్ అవుతుంటారు. కొందరు వీడియోలు చేయడం, మరికొందరు వీడియోల్లో తరచూ కనిపించడం ద్వారా సెలబ్రిటీలుగా మారుతుంటారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు కుమారి ఆంటీ. హైదరాబాద్ లోని ఇనార్భిట్ మాల్ వద్ద ఫుట్ సెంటర్ పెట్టిన ఈ ఆంటీ.. ఇంటర్య్వూలు ఇవ్వడంతో సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి. అలానే ఆమె లక్షల్లో సంపాదిస్తున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈక్రమంలోనే తనకు లక్షల్లో ఆదాయం రావడం లేదంటూ అనేక ఇంటర్వ్యూల్లో కుమారి ఆంటీ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆంటి.. ఏపీ సీఎం జగన్ నుంచి పొందిన సాయం గురించి ప్రస్తావించారు.
ఇటీవల భీమిలీలో జరిగిన వైఎస్సార్ సీపీ ‘సిద్ధం’ సభ సూపర్ హిట్ అయింది. ఆ సభ నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రాబోయే ఎన్నికల గురించి కార్యకర్తలకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ కొన్ని కీలక విషయాలను చెప్పుకొచ్చారు. టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, మరికొందరు క్యాంపెయినర్లుగా ఉన్నారని, తనకు మాత్రం ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు. ఆయన ఎందుకు అలా అన్నారో ప్రత్యర్థులకు అర్థం కాలేదు. కానీ.. జనం నుంచి సీఎం జగన్ కు ఏ స్థాయిలో మద్దతు ఉందనేదానికి తాజాగా కుమారి ఆంటీకి సంబంధించిన ఓ వీడియో ఉదాహరణ.
హైదరాబాద్ లో ఏ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారికి రాని క్రేజ్, కవరేజ్ కుమారి ఆంటీకి దక్కింది. ఆవిడ పుడ్ సెంటర్ ముందు పెద్ద సంఖ్యలో జనాలు క్యూలు కట్టడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఫుడ్ దొరక్క ఖాళీ ప్లేట్లతోనే వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆవిడకు అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఒక వీడియో బాగా వైరల్ కావడమే. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఏపీ సీఎం జగన్ గురించి ప్రస్తావించింది. “మీకు కార్లు, చాలా ఎకరాల పొలాలు ఉన్నాయని ప్రచారం జరుతుందని” యాంకర్..కుమారి ఆంటీని అడిగారు.
యాంకర్ అడిగిన ప్రశ్నకు కుమారి ఆంటీ స్పందిస్తూ.. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, కార్లు, పొలాలు అసలు లేవని తెలిపారు. అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్లు మాత్రమే ఉందని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు. తనకు సీఎం జగన్ ఇళ్ల ఇచ్చారని అది మాత్రమే తనకున్న ఆస్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సీఎం జగన్ అభిమానులు అయితే తెగ కృషి అవుతున్నారు. తమ అభిమాననేత ఊరికే అన్నలేదు.. ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని.. అందుకు నిదర్శనం ఈ కుమారి ఆంటీ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వాస్తవానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరి ప్రభుత్వ పథకాలు అందేందుకు కృషి చేశారు. కులం, మతం, పార్టీ లాంటివి ఏమి లేకుండా.. అర్హతే కొలమానంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో ఇదే మాటను పదే పదే ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఏ ఒక్కరికి నష్టం జరకూదని, ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈక్రమంలోనే ఎంతో మంది పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ప్రభుత్వ సాయం అందుతుంది. ఇళ్లు లేని వారికి ఇళ్లు వంటివి కూడా సీఎం జగన్ సమాకూరుస్తున్నారు. అందుకు ఉదాహరణే కుమారి ఆంటీ మాటలు. ఈమెలాగా ఇప్పుడు సామాన్య ప్రజలే సీఎం జగన్ ద్వారా పొందిన సాయం గురించి చెప్పుకుంటున్నారు. ఇందుకేనేమో సామాన్యులే తన స్టార్ క్యాంపెయిన్లరు అని సీఎం జగన్ చెప్పారు. మరి.. సీఎం జగన్ పై కుమారి ఆంటి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This famous Hyd street food vendor known as ‘Kumari Aunty’ says about her recently sanctioned House in AP.
సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్లు అని ఊరికే అనలేదు జగన్.#JaganMarkGovernance #2024JaganOncemore pic.twitter.com/Kpmigf2mfU
— TOVINO𓃵 (@Vamos_Rafa23) January 30, 2024