iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ఆ ఎక్స్ ప్రెస్ రైళ్లు అక్కడ ఆగవు!

Express Trains Stops Changes: నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదుల సంఖ్యలో ట్రైన్లు  నడుస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని మార్గాల్లో వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణిలకు ఓ అలెర్ట్ వచ్చింది.

Express Trains Stops Changes: నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదుల సంఖ్యలో ట్రైన్లు  నడుస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని మార్గాల్లో వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణిలకు ఓ అలెర్ట్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ఆ ఎక్స్ ప్రెస్ రైళ్లు అక్కడ ఆగవు!

మన దేశంలో ప్రధానమైన రవాణ వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం ఎంతో మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇక టికెట్ ధర కూడా అందుబాటులో ఉండటంతో ట్రైన్ లో జర్నీ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక కొత్త కొత్త సదుపాయాలను కల్పిస్తు..వారి జర్నీని సులభతరం చేస్తుంది. అయితే కొన్ని సార్లు రైల్వే శాఖ తీసుకునే నిర్ణయాలు ప్రయాణికులకు అసంతృప్తిని కలిగిస్తుంటాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ అలెర్ట్ వచ్చింది. ఏపీ, తెలంగాణ  రాష్ట్రాల్లో ప్రయాణించే నాలుగు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపులను ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఆ ట్రైన్లు ఏంటి, వాటి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదుల సంఖ్యలో ట్రైన్లు  నడుస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని మార్గాల్లో వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆయా మార్గాల్లో రైళ్లను పెంచుతుంటారు. ఇదే సమయంలో కొన్ని సార్లు పలు రైళ్ల స్టాపుల విషయంలో కూడా రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా నిత్యం రద్దీగా ఉండే నారాయణాద్రి, విశాఖ, చైన్నై ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ కి సంబంధించిన స్టాపుల మార్పులు చేశారు. అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రయాణీకులకు కష్టాలు తప్పేలా లేదు.

Trains not stopping those stations

నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్లలో స్టాప్ ఎత్తివేస్తూ రైల్వే శాఖ అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందిగా మారనుంది. కోవిడ్ టైమ్ లో  రైల్వే బోర్డు అధికారులు నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా ఏడాది పాటు ఈ రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేందుకు అధికారులు అంగీకరించారు.

అలా రైల్వేశాఖ ఇచ్చిన  ఏడాది సమయం ఈ నెల 19తో ముగియనుంది. దీంతో, ఆ రోజు నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్ ప్రెస్ లకు ఆయా స్టాపులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రైల్వే ఐఆర్సీటీసీ అధికారులు మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల స్టేషన్ లకు రిజర్వేషన్లు ఆపేశారు. ఇక సికింద్రబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే..విశాఖ ఎక్స్ ప్రెస్ రైలుకు నల్గొండ స్టాప్ కూడా ఎత్తివేశారు. తిరుపతి, చెన్నై, భువనేశ్వర్ కు వెళ్లే ఈ మూడు ప్రధాన రైళ్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. అయితే, తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జూలై 19వ తేది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి