iDreamPost
android-app
ios-app

Srikakulam: సిరిమాను ఉత్సవంలో అపశృతి.. ఇద్దరు మృతి.. ఏం జరిగిందంటే

  • Published Jun 19, 2024 | 10:28 AM Updated Updated Jun 19, 2024 | 10:28 AM

శ్రీకాకుళం సిరిమాను ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఎంతో ఘనంగా జరుగుతున్న ఉత్సవాల్లో ఉన్నట్లుండి చోటు చేసుకున్న ఓ ఘటన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఆ వివరాలు..

శ్రీకాకుళం సిరిమాను ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఎంతో ఘనంగా జరుగుతున్న ఉత్సవాల్లో ఉన్నట్లుండి చోటు చేసుకున్న ఓ ఘటన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఆ వివరాలు..

  • Published Jun 19, 2024 | 10:28 AMUpdated Jun 19, 2024 | 10:28 AM
Srikakulam: సిరిమాను ఉత్సవంలో అపశృతి.. ఇద్దరు మృతి.. ఏం జరిగిందంటే

దసరా, దీపావళి, వినాయక చవితి వంటి పండుగలతో పాటు ఊర్లలో గ్రామ దేవతల పండగలు కూడా అదే స్థాయిలో భారీగా నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో అయితే మరి కొన్ని రోజుల్లో అనగా ఆషాఢ మాసం ఆరంభం అయ్యిందంటే చాలు బోనాలు ఉత్సవాలు జోరందుకుంటాయి. ఆ తర్వాత వరుసగా పండగలు వస్తూనే ఉంటాయి. బోనాలు ఉత్సవం కూడా గ్రామ దేవతల పండగే. అలానే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమయంలో కొన్ని జిల్లాల్లో గ్రామ దేవతల పండుగలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ కోవకు చెందిన ఓ ఉత్సవమే సిరిమాను ఉత్సవం. అయితే ఈ ఏడాది పండుగ వేళ అపశృతి చోటు చేసుకుంది. ఆ వివరాలు..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి దొర్లింది. ఈ ఊరిలో మంగళవారం నాడు గ్రామ దేవత శ్రీ అసిరితల్లి, శ్రీబంగారమ్మ తల్లి సిరిమాను ఊరేగింపు కన్నులపండుగగా నిర్వహించారు. జనాలంతా భక్తితో అమ్మలను కొలుచుకుంటున్నారు. ఇంతలో అనూహ్య సంఘటన చోటు చేసుకుని.. అపశృతి దొర్లింది. దాంతో ఇద్దరు మృతి చెందారు. ఈ దారుణం ఎలా జరిగింది అంటే.. సిరిమాను ఒక్కసారిగా విరిగిపోయింది. దాంతో సిరిమాను చిట్టచివర కూర్చున్న పూజారి.. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు. ఈ క్రమంలో కిందనున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను బుడగట్లపాలేం గ్రామానికి చెందిన సూరాడ అప్పన్న (47), కారి పల్లేటి (50) గా గుర్తించారు పోలీసులు.

ఈ ఘటనలో సిరిమానుపైనుంచి కింద పడ్డ పూజారితో పాటు మరికొంత మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన భక్తులు వారికి చికిత్స అందించడం కోసం.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అప్పన్న, పల్లేటి మృతి చెందడంతో బుడగట్ల పాలెం గ్రామంలో విషాదం నెలకొంది.

భక్తులందరూ చూస్తుండగా ఎత్తులో ఉన్న సిరిమాను చివరి భాగం నుంచి పూజారి కిందపడటాన్ని చూసి.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఎంతో భక్తిగా అమ్మవార్లకు ఉత్సవం చేస్తుండగా ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడంతో జనాలు భయపడిపోయారు. పోలిసులు వెంటనే ఘటనాస్థలంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.