iDreamPost
android-app
ios-app

‘అమ్మ’ కోసం విదేశాల్లో జాబ్ వదిలేసి.. పానీపూరి బండి వ్యాపారం!

‘అమ్మ’ కోసం విదేశాల్లో జాబ్ వదిలేసి.. పానీపూరి బండి వ్యాపారం!

సాధారణంగా విదేశాల్లో మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో హాయిగా జీవనం. ఇలా ఉంటే.. ఎవరైనా.. ఆ పరిస్థితులును వదిలేసుకుని కూలీ పనులు లేదా రోడ్డుపై బండి పెట్టుకుని వ్యాపారం చేయడానికి సాహసం చేస్తారా. చాలా మంది అలాంటి ధైర్యం చెయ్యరు. అమ్మకు బాగాలేదంటే.. ఆమె కోసం జాబ్ లు వదిలేసుకుని వచ్చే పుత్రులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు.. విజయనగరం జిల్లాకు చెందిన దాసరి వేణు. విదేశాల్లో ఎంతో హాయిగా సాగిపోతున్న అతడి జీవితంలో.. అమ్మా అనారోగ్యంతో ఉందని వార్త అలజడి రేపింది. అమ్మ రుణం తీర్చుకునేందుకు సుఖాలను వదులుకుని స్వదేశానికి వచ్చాడు. మరి.. బంగారు కొడుకు  కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన వెంకటరావు,రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు దాసరి వేణు.. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దాసరి వేణు తండ్రి వెంకటరావు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. ఆ పనితోనే ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించాడు. వేణు తమ్మడు చంద్రశేఖర్ టూరిస్టు గైడ్ గా పని చేస్తున్నాడు. ఇక వేణు..దుబాయ్ లో మెరైన్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.80 వేల జీతం. అలానే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

రెండేళ్ల పాటు దుబాయ్‌లోని ఎన్‌ఎస్‌ఎల్‌ కంపెనీలో మెరైన్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఈ ఏడాది సెలవులు తీసుకుని సొంత ఊరికి వచ్చి.. మళ్లీ ఏప్రిల్‌లో దుబాయ్ వెళ్లారు. వేణు దుబాయ్ వెళ్లిన 15 రోజులకే అమ్మ రాజేశ్వరికి క్యాన్సర్  అని తెలిసింది.  ఇదే విషయాన్ని కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు. ‘నువ్వు అక్కడే నా చివరి చూపు కూడా దక్కదేమో’ అంటూ వేణు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ కోసం ఉద్యోగాని వదిలేసి.. తిరిగి సొంత ఊరికి వచ్చేశాడు.  స్థానికంగా మెరైన్‌ ఇంజినీరింగ్ ఉద్యోగాలు లేకపోవడంతో.. జీవనం కోసం పానీపూరీ బండి ప్రారంభించారు.

అలా ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తూ వేణు కొత్త జీవితం ప్రారంభించాడు. అలానే ఉపాధితో పాటు అమ్మకు తోడుగా ఉన్నాడు. తన తల్లి ఉన్నంతకాలం జాగ్రత్తగా చూసుకుంటానని  వేణు  అన్నారు. తాను ఉద్యోగం వదిలేశాననే బాధ లేదని.. అమ్మను చూసుకునేఅదృష్టం తనకు దక్కిందన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా.. వారిని ఇంటి నుంచి గెంటేస్తున్న బిడ్డలు ఉన్న.. ఈ రోజుల్లో వేణు వంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వేణును కూడా స్థానికులు కూడా అభినందిస్తున్నారు. మరి.. ఈ అమ్మ కొడుకుపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.