iDreamPost
android-app
ios-app

అనారోగ్యం వెంటాడుతున్నా.. ఏడేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డులు!

Sattenapalli News: ప్రతి ఒక్కరిలో ప్రతిభ అనేది ఉంటుంది. అంతేకాక మరికొందరు కృషి, పట్టుదలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తాజాగా ఓ ఏడేళ్ల చిన్నారి.. అనారోగ్యంతో బాధపడుతూనే నాలుగు వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది.

Sattenapalli News: ప్రతి ఒక్కరిలో ప్రతిభ అనేది ఉంటుంది. అంతేకాక మరికొందరు కృషి, పట్టుదలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తాజాగా ఓ ఏడేళ్ల చిన్నారి.. అనారోగ్యంతో బాధపడుతూనే నాలుగు వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది.

అనారోగ్యం వెంటాడుతున్నా.. ఏడేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డులు!

ప్రతి ఒక్క బాలబాలికల్లో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. అయితే కొందరు చిన్నారుల టాలెంట్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. తమదైన మేధాశక్తితో పలు రికార్డులను క్రియేట్ చేస్తారు. ఇది ఇలాంటే కొందరు చిన్నారులు అనారోగ్యంతో ఉన్నా కూడా పలు వరల్డ్ రికార్టులను క్రియేట్ చేసి.. అందరిచేతా హ్యాట్సాప్ అనిపించుకుంటారు. తాజాగా పల్నాడు జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల చిన్నారి… అనారోగ్యం వెంటాడుతున్నా నాలుగు రికార్డులతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే….

ఏపీ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలి కారు డ్రైవర్‌ పని చేస్తున్నాడు. అతడు కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2017లో అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అనే పాప జన్మించింది. ఆ పాప  ఐదు నెలల వయస్సులో జన్మించి..కేవలం 500 గ్రాములే బరువు ఉంది. అంతేకాక అవయవాలు పూర్తిగా రూపుదాల్చలేదు. ఆ చిన్నారి శరీరమంతా వెంట్రుకలతో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇక వివిధ వైద్య పరికరాల సాయంతో ప్రత్యేక గదిలో ముడున్నరేళ్ల వయసు వరకు చికిత్స అందించారు.

ఇంకా చెప్పాలంటే.. ఆ పాపను గాజు బొమ్మలాగా చూసుకున్నారు. ఆ పాప వైద్యానికి దాదాపు రూ.25 లక్షలు ఖర్చైంది. ఈ క్రమంలోనే చిన్నారి ఆరోగ్యం కాస్తా కుదుట పడింది. పాప తన అనారోగ్య సమస్యల కారణంగా ఎప్పుడూ మాస్క్‌తో ఉంటూ, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాక ఆ చిన్నారి ఇతర విద్యార్థులకు దూరంగా ఉండేది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ 2023-24లో 197 రోజుల పాటూ స్కూల్లో తరగతులు జరగ్గా.. అన్ని రోజులు హజరైంది. అయత్ అలా పాఠశాలకు వెళ్లినందుకు ఇప్పటి వరకు ప్రతిష్ఠాత్మక నాలుగు వర్డల్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(యూకే), ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఎప్పటికైనా తాను పాటలు పాడుతూ టీవీలో కనిపించడం తన లక్ష్యమని అయత్ చెబుతున్నారు. చిన్నారులు ఎవరైనా స్కూలుకు వెళ్లాలంటే ఏదో వంక చెప్పి డుమ్మా కొడుతుంటారు. కానీ అయాత్ మాత్రం ప్రతి రోజూ పాఠశాలకు వెళ్తూ.. హాజరులో రికార్డులు సృష్టిస్తోంది. ఇక పాప విషయం తెలిసి..చాలా మంది ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఈ చిన్నారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.