ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశ పెట్టిన అతిముఖ్యమైన వ్యవస్థలో వాలంటీర్ ఒకటి. ఇక ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందించే పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి. అలానే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వీరి సేవలు ఎంతో ఉపయోగ పడ్డాయి. కరోనా కట్టడికి వీరు అందించిన క్షేత్ర స్థాయి సమాచారం ఎంతో ఉపయోగపడింది. ఈ వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన.. ఎంతో మంది మేధావులు, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు వచ్చి.. బాధితులను ఆదుకుంటున్నారు. తాజాగా ఇటీవల కురిసిన వరదల సమయంలో బాధితులకు వారు అందించిన సేవ నిరూపమానం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో వర్ష భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గోదావరి పరివాహ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్నో గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరద ముంపునకు గురైన గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులను ఆదుకోవడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఈ విపత్క పరిస్థితులో అంకితభావంతో కూడిన ప్రభుత్వ వాలంటీర్లు.. బాధితులకు ఆశల వెలుగులుగా ఉద్భవించారు.
ప్రజల కష్టాలను తగ్గించి, ముఖాల్లో చిరునవ్వులను తిరిగి తీసుకురావడానికి వాలంటీర్లు గత కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అలుపెరగని ప్రయత్నాలకు సాక్షిగా ఎన్నో ఘటనలు కనిపించాయి. ఇక వాలంటీర్లు.. కష్టాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించారు. ఆ సమచారాన్ని ప్రభుత్వ అధికారులు దృష్టికి చేరవేస్తున్నారు. అలానే వరద బాధితులకు కూరగాయలు, నూనె వంటి అనేక నిత్యావసరాలను అందిస్తున్నారు. ఇక వాలంటీర్ల నిస్వార్థత, సమాజానికి సేవ చేయాలనే అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీలోని వాలంటీర్ల సేవలను గుర్తించి… ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు కూడా కారణం లేక పోలేదు. కష్ట సమయాల్లో మద్దతుగా ప్రజల కోసం వాలంటీర్లు నిలబడ్డారు. ఏపీ వాలంటీర్ల అచంచలమైన స్ఫూర్తి అభినందనీయం వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అంటున్నారు. ఇక వాలంటీర్ల సేవలు నిరుపమానం అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. వాలంటీర్ల కారణంగానే సమయానికి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని పలువురు బాధితులు తెలిపారు. మరి… వాలంటీర్లపై ప్రజలు కురిపిస్తున్న ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్! ఆగష్టు10న సున్నా వడ్డీ కార్యక్రమం..