iDreamPost

సికింద్రాబాద్‌- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ లో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలు..

రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ లో నిప్పు రవ్వలు ఎగిసిపడడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు.

రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ లో నిప్పు రవ్వలు ఎగిసిపడడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు.

సికింద్రాబాద్‌- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ లో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలు..

ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ సమస్యలతో లేదా లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సామాన్యుడి విమానంగా పేరుగాంచిన రైలు ప్రయాణానికి ఆదరణ ఎక్కువ. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. అయితే ట్రైన్స్ ప్రమాదాల భారిన పడుతుండడంతో రైలు ప్రయాణమంటేనే బెంబెలెత్తి పోతున్నారు. తాజాగా మరో రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ రైలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ నుంచి రేపల్లె బయలు దేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సిక్రిందాబాద్‌ నుంచి ప్రయాణికులతో బయలు దేరిన రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ లో గుంటూరు బైపాస్‌ వద్దకు చేరుకోగానే పెద్ద శబ్దం వచ్చి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఊహించని ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే స్పందించి బోగిలో ఉన్న చెయిన్‌ను లాగి రైలును నిలిపివేశారు. ఆ తర్వాత లోకో పైలట్ ప్రమాదం జరిగిన బోగి వద్దకు చేరుకుని సాంకేతిక లోపంతో ఈ ఘటన జరిగిందని నిర్ధారించి సమస్యను పరిష్కరించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో గంటపాటు రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి