P Venkatesh
SCR Special Trains: ఈ ఏడాది దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపికబురును అందించింది. సికింద్రా బాద్ నుంచి స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు నిర్ణయించింది.
SCR Special Trains: ఈ ఏడాది దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపికబురును అందించింది. సికింద్రా బాద్ నుంచి స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు నిర్ణయించింది.
P Venkatesh
ఇరు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన దసరాను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కి వలస వచ్చిన వారు పండగ వేళ సొంతూళ్లకు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ సమయాల్లో ట్రైన్లు అన్ని కిక్కిరిపోతుంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడుపుతుంది. ఈ ఏడాది కూడా దసరా, దీపావళి పండగల సందర్భంగా ఎస్సీఆర్ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. మొత్తం 48 స్పెషల్ ట్రైన్లను నడిపేందుకు సిద్ధమైంది. దీంతో సోంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి.
దసరా, దీపావళి పండుగలకు సొంతూళ్లకు వేళ్లాలనే ప్లాన్ లో ఉన్నారా? అందుబాటులో ఏయే ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయని సెర్చ్ చేస్తున్నారా? అయితే సౌత్ సెంట్రల్ రైల్వే మీకు గుడ్ న్యూస్ అందించింది. పండగల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది. 48 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 10 నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్, కాచీగూడ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
కాచిగూడ- తిరుపతి (07653) రైలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుంది.
తిరుపతి – కాచిగూడ (07654) అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు నడుస్తుంది.
సికింద్రాబాద్ – నాగర్సోల్ (07517) అక్టోబర్ 9 నవంబర్ 6 వరకు నడుస్తుంది.
నాగర్‌సోల్ – సికింద్రాబాద్ (07518) సర్వీస్ అక్టోబర్ 10 నవంబర్ 7వరకు నడుస్తుంది.
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07122) అక్టోబర్ 7 నవంబర్ 4వరకు నడుస్తుంది.
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07188) అక్టోబర్ 8 నవంబర్ 5 వరకు నడుస్తుంది.