Dharani
School Timings: విద్యార్థులకు కీలక అలర్ట్ జారీ చేశారు. పాఠశాల సమయాల్లో మార్పులు చేశారు. ఆ వివరాలు..
School Timings: విద్యార్థులకు కీలక అలర్ట్ జారీ చేశారు. పాఠశాల సమయాల్లో మార్పులు చేశారు. ఆ వివరాలు..
Dharani
ఎండలు మండుతున్నాయి. మార్చి నెలలోనే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు చూస్తే.. పరీక్షల సీజన్ మొదలైంది. ఇంటర్, పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి సూర్యుడు చెలరేగిపోతున్నాడు. ఇక ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. మండుతున్న ఎండల కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని.. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈక్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, కాలేజీల సమయాల్లో మార్పులు చేసింది. ఏపీలోని స్కూల్స్‌కి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 1:30 గంటల వరకు మాత్రమే పాఠశాలను నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏపీతో పాటు కర్ణాటకలోని విద్యాసంస్థల టైమింగ్స్‌ని కూడా మార్చింది ప్రభుత్వం. అక్కడ కూడా మార్చి 12వ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మాత్రమే పాఠశాలను నిర్వహించనున్నారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఎండలు మండుతున్న నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ ఇప్పటికే రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 15వ తేదీ నుంచి రాఫ్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయి.
అయితే 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం నుంచి క్లాసులు నిర్వహిస్తారు. వీరికి తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు నిర్వహిస్తారని వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా స్కూల్స్‌లో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటి పూట బడుల తేదీలపై త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.