iDreamPost
android-app
ios-app

వీడియో: టీచర్ పెళ్లి.. క్వశ్చన్ పేపర్ రూపంలో పెళ్లి కార్డు!

Question Paper Model Wedding Card: ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను తమ జీవితాంతం గుర్తుండి పోవాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరూ వినూత్నంగా ఆలోచిస్తూ.. అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు.

Question Paper Model Wedding Card: ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను తమ జీవితాంతం గుర్తుండి పోవాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరూ వినూత్నంగా ఆలోచిస్తూ.. అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు.

వీడియో: టీచర్ పెళ్లి.. క్వశ్చన్ పేపర్ రూపంలో పెళ్లి కార్డు!

నేటికాలంలో జరిగే పెళ్లిళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పెళ్లి నిశ్చయమైన దగ్గర నుంచి వివాహ కార్యక్రమాలు పూరయ్యై వరకు జరిగే అన్ని పనులను వెరైటీగా చేస్తున్నారు. గతంలో పెళ్లి వేడుకను, వెడ్డింగ్ షూట్లను చాలా వెరైటీగా చేసే వారు. టెక్నాలజీని వినియోగించి.. అబ్బురపరిచేలా వెడ్డింగ్ సెలబ్రెషన్స్ జరుపుకుంటున్నారు. కొందరు పెళ్లి కార్డుల విషయంలో కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. తాజాగా ఓ టీచరమ్మ పెళ్లి కార్డు వెరైటీగా ఉంది. తాను టీచర్ కావడంతో పెళ్లి కార్డును కూడా క్వశ్చన్ పేపర్ రూపంలో తయారు చేసి.. అందులోనే పెళ్లికి సంబంధించిన వివరాలు తెలిపింది. ప్రస్తుతం ఆ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ప్రత్యూష టీచర్ గా పని చేస్తున్నారు. ఆమెకు ఫణీంద్ర అనే అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. ఆమె వివాహం ఆగష్టు 23న జరగనుంది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి కార్డు ప్రత్యేకంగా, అందరూ గుర్తుంచుకునేలా ఉండాలని ప్రత్యూష భావించారు. అందుకే పెళ్లి కార్డును ప్రశ్నా పత్రం రూపంలో రూపొందించారు. ఆ పెళ్లి కార్డును క్వశ్చన్ల రూపంలో ఇచ్చి..వాటికి సమాధానాలు కూడా ఆప్షన్స్ రూపంలో ఇచ్చారు. అలాగే సరైన సమాధానం ఎంపిక చేసుకోవాలంటూ పలు విభాగాల్లో ప్రశ్నలు రూపొందించారు. ట్రూ ఆర్ ఫాల్స్,  చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అనే విధంగా కార్డును ప్రింట్ చేయించారు.

ఇంకా చెప్పాలంటే పోటీ పరీక్షల ప్రశ్నల మాదిరిగా పత్రికను  ప్రత్యూష అచ్చు వేయించారు. మొత్తంగా సింగిల్ ఆన్సర్  క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా  రూపొందిన ప్రత్యూష  పెళ్లి పత్రిక అందరిని ఆకట్టుకుంటుంది. వివాహానికి ఆహ్వానిస్తున్న జంటల పేర్లను రాసి,..సరైన ఆన్సర్ ను బోల్డ్ లో ఉంది. అదేవిధంగా వాటితోపాటు “పెళ్లి సమయం, పెళ్లి జరిగే ప్రదేశం, పెళ్లి మండపం ఇలా… మొత్తంగా 8 విభాగాల్లో అనేక ప్రశ్నలు వేసి.. చూపరులకు ఆసక్తికలిగేలా చేశారు. మొత్తానికి ప్రత్యూష తన పెళ్లి కార్డును ఓ ప్రశ్న పత్రంగా మార్చేశాడు. అంతేకాకుండా పెళ్లికార్డు టాప్ లో వందకు వంద మార్కులు కూడా  ఉంటాయన్నట్లు  అందులో చూపించింది. ప్రస్తుతం ప్రత్యూష వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.