‘యాపిల్’ సాంగ్ తో కోట్లు సంపాదించిన స్కూల్ టీచర్!

ప్రస్తుత రోజుల్లో నెటిజన్లు సోషల్ మీడియాను ఏ విధంగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.అయితే సోషల్ మీడియా యుగంలో, ఏది వైరల్ అవుతుందో మనకు ఎప్పటికీ తెలియదు. అలా వైరల్ అయినా ఓ సాంగ్ ఓ స్కూల్ మాస్టర్ కి కోట్లు తెచ్చిపెట్టిందని సమాచారం.

ప్రస్తుత రోజుల్లో నెటిజన్లు సోషల్ మీడియాను ఏ విధంగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.అయితే సోషల్ మీడియా యుగంలో, ఏది వైరల్ అవుతుందో మనకు ఎప్పటికీ తెలియదు. అలా వైరల్ అయినా ఓ సాంగ్ ఓ స్కూల్ మాస్టర్ కి కోట్లు తెచ్చిపెట్టిందని సమాచారం.

నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఉపయోగించని వారు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియా కారణంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతుంటారు. అయితే దానిని సరైన క్రమంలో వాడుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు. కొందరు సోషల్ మీడియాను ఏ విధంగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం.. ఇలా ప్రతి విషయాన్ని నెట్టింట్లో షేర్ చేసుకుంటారు. కొందరు తమ వీడియోలతో భారీగా సంపాదిస్తుంటారు. అలానే ఓ టీచర్ సరదగా చేసిన వీడియో.. ఆయనకు కోట్లు వచ్చేలా చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సోషల్ మీడియా యుగంలో చాలా మంది తమకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బయటి ప్రపంచానికి చూపిస్తున్నారు. అయితే ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోల్లో ఏది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. చాలా ఏళ్ల క్రితం ఒకప్పుడు విడుదలైన సాంగ్స్ కూడా ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న పాటలున్నాయి. ఆకోవాలోనే ఆరేళ్ల క్రితం ఓ స్కూల్ టీచర్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన సాంగ్  ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఏపీకి చెందిన బిక్కి శ్రీనివాసులు అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గ మండలం ఎంపీపీ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు. ఈయన పాఠశాల పిల్లలకు పాటలు, నటన ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేశారు. పాటల, ఆటలు ద్వారా నేర్పిస్తే పిల్లలు త్వరగా నేర్చుకోగలరని ఎక్కువ మంది టీచర్లు అభిప్రాయ పడుతుంటారు. అలాగే బిక్కి శ్రీనివాసులు కూడా ఆలోచించారు.

అలా ఆరేళ్ల క్రితం ‘యాపిల్..యాపిల్..రెడ్ రెడ్ యాపిల్’ అనే పాటను రూపొందించారు. ఇక ఈ సాంగ్ లో యాపిల్, బనానా వంటి మరికొన్ని పండ్లను చూపిస్తూ, రంగు రుచిని వివరిస్తూ రూపొందించారు. దాన్ని విద్యార్థుల చేత పాడించి.. వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా యూట్యూబ్‌లో షేర్ చేశారు. అప్పటి కంటే.. ఇటీవల ఈ పాట తెగ వైరల్‌ అయింది ఏకంగా189 కోట్ల మంది వీక్షించారు. దీంతో ఈ ఉపాధ్యాయుడు కోట్లు సంపాదించినట్లు సమాచారం. అలాగే ‘బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై’ పాటను రూపొందించగా..దానికి 1.1 కోట్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా ఈ మాస్టార్ కి యూట్యూబ్‌లో 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం గమనార్హం. పిల్లలకు పాటల రూపంలో చదువుతు చెప్పిన శ్రీనివాసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి.. వినోదంతో విజ్ఞానం పంచిన ఈ ఉపాధ్యాయుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments